పాక్‌లో ఉగ్రదాడి: రెండు చర్చిలపై దాడి, 15మంది మృతి
లాహోర్: పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రవాదుల రెచ్చిపోయారు. లాహోర్‌లోని యొహనాబాదులో రెండు క్రైస్తవమత ప్రార్థనా మందిరాల (చర్చి) పైన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ జంట పేలుళ్లలో పదిహేను మంది మృతి చెందారు. మరో యాభై మంది వరకు గాయపడ్డారు.
యోహనాబాదులో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. టీవీ రిపోర్ట్స్ ప్రకారం... పాకిస్తాన్ తాలిబన్‌లు ఈ దాడికి తామే పాల్పడినట్లు ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

సంఘటన స్థలానికి అత్యవసర, భద్రతా దళాలు చేరుకున్నాయి. ఈ సంఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications