రష్యా చేతిలో బందీగా 4 లక్షల మంది.. సాయం కోసం జో బైడెన్‌కు జెలెన్‌స్కీ ఫోన్!
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులను కొనసాగిస్తోంది. పలు ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకుంటూ.. బాంబులతో విరుచుకుపడుతోంది. రేపు పట్టణమైన మరియుపోల్ , వోల్నోవాఖ నగరాలను రష్యా దళాలు దిగ్బంధించాయి. ఈ రెండు పట్టణాలను స్వాధీనం చేసుకునేందుకు నలువైపుల నుంచి క్షిపణులతో దాడులు చేస్తోంది. స్థానిక పౌరులను తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా .. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ కాల్పులకు దిగింది.

మాటల తప్పిన రష్యా..
రష్యా దురాక్రమణ చర్యలపై ఉక్రెయిన్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. పౌరుల తరలింపునకు సమయం ఇచ్చి.. ఇప్పుడు మాటతప్పితుందని దుయ్యబట్టింది. హ్యుమానిటేరియన్ కారిడార్‌ను నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే నగరాల్లో నీరు, విద్యుత్, ఆహారం సమస్యలు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టుతో పాటు నివాస ప్రాంతాలపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఎటు చూసినా భయానక పరిస్థితులు కన్పిస్తున్నాయి.

భయానక పరిస్థితులు
ఉక్రెయిన్ శాంతి చర్చల సందర్భంగా రష్యా తాత్కాలిక కాల్పుల విరమణకు ప్రకటించింది. వోల్నోవాఖ, మరియుపోల్ నగరాల నుంచి పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించింది. దీంతో మరియుపోల్ నుంచి ప్రజలను తరలింపునకు రైళ్లను, బస్సులను ఉక్రెయిన్ సిద్దం చేసింది. అయితే ఆ ఒప్పందాలను ఉల్లంఘించి రష్యా మరలా దాడులకు దిగిందని మరియుపోల్ మేయర్ వదిమ్ బాయ్ చెంకో ఆరోపించారు.

అమెరికా అధ్యక్షుడుకి జెలెన్ స్కీ ఫోన్
రష్యా సేనలు తమ దేశానికి చెందిన 4 లక్షల మంది పౌరులను బందించిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. భారీ క్షిపణులు, బాంబులతో విరుచుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాతో పోరాడేందుకు తమకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచ దేశాలను కోరారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఫోన్ లో మాట్లాడారు. రష్యాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాయం చేయాలని కోరారు. తమ పౌరులను రష్యా సేనలు బందించిందని తెలిపారు. తమ దేశానికి ఆర్థిక, రక్షణ సాయం అందించాలని కోరారు.

రష్యా హెలికాప్టర్ కూల్చివేత
అటు రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయి. ఈ యుద్ధం రష్యాకు కూడా భారీగానే నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 10వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా యుద్థ విమానాలను, ట్యాంకర్లను ద్వంసం చేసింది. తాజాగా చెర్నిహవ్ నగరానికి సమీపంలో రష్యా హెలికాప్టర్ ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. రష్యా పైలట్ మేజర్ క్రివోలాపోవ్ మరణించారని తెలిపింది.












Click it and Unblock the Notifications