41 కోట్ల మంది శృంగార రహస్యాలు బట్టబయలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ చరిత్రలోనే అతి పెద్ద లీక్ వెలుగు చూసింది! ఏకంగా నలభై కోట్ల మందికి సంబంధించిన శృంగార రహస్యాలు ఒకేసారి బయటపడ్డాయి. ఇంటర్నెట్ సెక్యురిటీ లోపాలను బయటపెట్టే లీక్డ్ సోర్స్ అనే వెబ్‌సైట్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది.
ఇంటర్నెట్ యూజర్లు ఆన్‌లైన్ శృంగార సంబంధాలను వెతుక్కునే అడల్డ్ ఫ్రెండ్ ఫైండర్ లాంటి పలు వెబ్ సైట్లలో రిజిస్టర్ అయిన నలభై ఒక్క కోట్ల అకౌంట్ల వివరాలు లీక్ అయ్యాయి. నలభై ఒక్క కోట్ల రెండు లక్షల పద్నాలుగువేల రెండు వందల తొంబై అయిదు మంది యూజర్ల సమాచారం బట్టబయలయిందట.

ఫలానా యూజర్ సెక్స్ అలవాట్లు ఏమిటి, వివాహేతర సంబంధాలను ఇష్టపడుతున్నాడా.. లాంటి వివరాలు ఆ డేటాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అడల్ట్ సైట్స్‌లో అకౌంట్లు ఉన్న వారు దీంతో షాకయ్యారు. ఈ సైట్లలో గతంలో రిజిస్టర్ అయి, తర్వాత డిలీట్ అయిన అకౌంట్ల సమాచారం కూడా ఉందని తెలుస్తోంది.
అడల్ట్ ఫ్రెండ్ ఫైండర్ నుంచి 33 కోట్లకు పైగా, కార్స్ నుంచి 6 కోట్లకు పైగా, స్ట్రిప్ షో నుంచి పద్నాలుకు లక్షలకు పైగా, పెంట్ హౌస్ నుంచి డెబ్బై లక్షలకు పైగా.. ఇలా అకౌంట్లు లీక్ అయ్యాయని తెలుస్తోంది.
దీనిని బయటపెట్టిన లీక్డ్ సోర్స్ స్పందిస్తూ.. తాము హ్యాకర్స్‌ము కామని, ఇంటర్ నెట్లో సెక్యూరిటీ పరంగా ఉన్న సమస్యలను గుర్తించి ప్రజలను చైతన్యవంతులను చేయడటమే తమ పని అని పేర్కొంది. కాగా, అడల్ట్ లీక్ చరిత్రలో ఇది పెద్ద లీక్ అని అంటున్నారు.












Click it and Unblock the Notifications