ఐఎస్ఐఎస్ కు 42 ఉగ్రవాద సంస్థల అండ

అమెరికా/సిరియా: అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా గుర్తింపు తెచ్చుకుని రెచ్చిపోతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)కు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న పలు ఉగ్రవాద సంస్థలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయని వెలుగు చూసింది.

ప్రపంచ దేశాల్లోని 42 ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నాయని గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన, సంపన్నమైన ఉగ్రవాద సంస్థగా ఐఎస్ఐఎస్ గుర్తింపు తెచ్చుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోని స్థానిక ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు అనుకూలంగా పని చెయ్యడానికి ముందుకు వచ్చారని వెలుగు చూసింది. ఇప్పటికే లిబియా, ఈజిప్టు, ఉజ్జెకిస్థాన్, ట్యునీషియా తదితర దేశాల్లోని ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్ తో కలిసి పని చేస్తున్నారు.

42 different Inter National militant groups have pledged support ISIS

పలు దేశాల్లోని ఉగ్రవాదులు అత్యంత అనుకూలంగా ఐఎస్ఐఎస్ కి పని చేస్తున్నారని నివేదికలో బయటపడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలు యువతను రెచ్చగొట్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలోకి పంపించడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఈ విషయాలు గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్ నివేదికలో వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు షాక్ కు గురైనాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాల్లోని ఉగ్రవాదులతో సంప్రదించి వారిని రెచ్చగొడుతున్నారని ఈ నివేదికలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+