‘బలవంతంగా నా ప్రైవేట్ భాగాలు తాకాడు’: ట్రంప్‌పై యోగా టీచర్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళలు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో మహిళా యోగా టీచర్ కూడా తనను బలవంతంగా తాకాడని, ప్రైవేట్ భాగాలను చేతులతో స్పృశించాడని ఆరోపించారు.

ఇప్పటికే మూడు డిబేట్లలో హిల్లరీ క్లింటన్ కంటే వెనకబడి పోయిన ట్రంప్.. లైంగిక ఆరోపణలతో మరోసారి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. యోగా టీచర్ కరెనా వర్జీనియా(45).. 18ఏళ్ల కిందట(1998లో) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్లేయర్స్‌కు ట్రైనర్‌గా పనిచేయగా.. ఆ సమయంలో ట్రంప్ తనను చూసి అసభ్య కామెంట్లు చేశాడని, ఆపై తన వ్యక్తిగత అవయవాలను హద్దుమీరి తాకాడని ఆరోపించింది.

45-yr-old Yoga teacher claims Trump groped her at 1998 Tennis tournament

''తొలుత ఓ వ్యక్తితో ట్రంప్ మాట్లాడుతూ.. ఆమెను చూడు.. గతంలో ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఓసారి ఆమె కాళ్లను గమనించు' అని కామెంట్ చేశారు. అంతేగాక, నా చేతి పట్టుకుని నన్ను గట్టిగా దగ్గరకు లాక్కుని వ్యక్తిగత అవయవాలను బలవంతంగా తాకాడు' అంటూ వర్జీనియా ఆవేదన వ్యక్తం చేసింది.

అప్పుడు తన వయసు 27 ఏళ్లు అని.. ఆ సమయంలో తాను నిస్సహాయురాలిగా ఉండిపోయానని, షార్ట్ డ్రెస్ తో పాటు హై హీల్స్ వేసుకోవడంతో సరిగ్గా స్పందించకలేక పోయానని ఆమె వాపోయారు. అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ మద్ధతుదారులు మాత్రం యోగా ట్రైనర్ వర్జీనియా చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే ట్రంప్‌పై మహిళలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+