మిమ్మల్ని గురకపెట్టకుండా చేసే, 5 పద్ధతులు

నిద్రపోతున్న యువతి

మనలో ఎంత మంది నిద్రలో గురక పెడతారు అనే విషయం ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ, ఈ సమస్య ఇప్పుడు పెరుగుతోంది.

ఈ సమస్య వల్ల గురకపెట్టే వారి నిద్ర పాడవడమే కాదు, వారికి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కంటి మీద కునుకు లేకుండా పోతుంది.

గురక ఎందుకు పెడతారు?

నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదలడం చేసినపుడు మన మెడ, తలలోని మృదు కణజాలంలో కంపనల వల్ల మనం గురక పెడుతుంటాం.

ఈ మృదు కణజాలం మన ముక్కు రంధ్రాల, టాన్సిల్స్, నోటి పైభాగంలో ఉంటుంది.

మనం నిద్రపోతున్న సమయంలో వాయుమార్గం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో గాలి చాలా బలవంతంగా లోపలికి వెళ్లాల్సుంటుంది. అందుకే మృదు కణజాలంలో కంపనలు ఏర్పడతాయి.

మనం గురక పెట్టకుండా ఏం చేయవచ్చు?

మనం గురకపెట్టకుండా ఉండాలంటే వాయుమార్గం తెరుచుకుని ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలా చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

గురక పెట్టకుండా ఉండాలంటే

1. నిద్రపోయే ముందు మద్యం వద్దు

మద్యం తాగాక నిద్రపోతున్నప్పుడు కండరాలు మరింత రిలాక్స్ అయిపోతాయి. దాంతో శ్వాసనాళాలు మరింత సన్నగా, ఇరుగ్గా అవుతాయి. దాంతో శ్వాస తీసుకోవడం, వదలడం చేసినపుడు గురక పెడతారు. అందుకే నిద్రపోయే ముందు మద్యం తాగకుండా ఉండాలని చెబుతుంటారు.

2. పక్కకు తిరిగి పడుకోవడం

మనం వెల్లకిలా పడుకున్నప్పుడు మన నాలుక, గడ్డం, గడ్డం కింద ఉన్న కొవ్వు కణజాలం అన్నీ మన వాయుమార్గానికి అడ్డంకిగా మారుతాయి. అందుకే మనం గురకపెడుతున్నట్టు తెలియగానే, పక్కకు తిరిగి పడుకోవడం మంచిది.

గురక పెట్టకుండా ఉండాలంటే

3. ముక్కుకు వేసే పట్టీలు

గురక పెట్టకుండా అడ్డుకోడానికి మార్గెట్లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముక్కుకు వేసుకునే పట్టీలు లాంటివి ఉన్నాయి. ఈ పట్టీలు మన ముక్కు రంధ్రాలు తెరిచుండేలా ఉంచుతాయని భావిస్తారు. మనం ముక్కు ద్వారా గురక పెడుతుంటే ఇవి బాగా ఉపయోగపడతాయి. కానీ, వీటి వల్ల నిజానికి ఏదైనా ప్రభావం ఉంటుందా అనేదానికి పెద్దగా రుజువులు లేవు.

గురక పెట్టకుండా ఉండాలంటే

4. ముక్కు శుభ్రంగా ఉంచుకోవాలి

మనకు జలుబు చేసినప్పుడు, ముక్కు మూసుకుపోతే, మనం గురక పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే, మనం మొదట ముక్కును బాగా శుభ్రం చేసుకోవాలి. ముక్కు శుభ్రం చేసుకోడానికి జలుబు వస్తే ముక్కులో వేసుకునే డ్రాప్స్ లాంటివి కూడా ఉపయోగించవచ్చు. వీటివల్ల ముక్కులో చాలా సున్నితమైన రక్త కణాల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా అలర్జీ వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. ఇవి ముక్కు దిబ్బడ నుంచి వెంటనే ఉపశమనం అందిస్తుంది. గురక పెట్టడం తగ్గుతుంది.

గురక పెట్టకుండా ఉండాలంటే

5. బరువు తగ్గించుకోండి

మన బరువు ఎక్కువగా ఉంటే, మన గడ్డం దగ్గర ఎక్కువగా కొవ్వు కణజాలం పేరుకుని ఉండచ్చు. దానివల్ల వాయుమార్గం ఇరుకైపోయి శ్వాసక్రియకు అడ్డంకిగా మారచ్చు. దాంతో గురకపెడతాం. అందుకే ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల గురక నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+