వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన నాటో మిలటరీ హెలికాప్టర్‌: ఐదుగురి మృతి

|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో నాటోకు చెందిన మిలిటరీ హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

నాటోకు చెందిన రిసొల్యూట్ సపోర్ట్ మిషన్‌లో భాగంగా బయలుదేరిన హెలికాప్టర్ సోమవారం ఉదయం కుప్పకూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇందులో ఉన్న ఐదుగురు మృత్యువాతపడ్డారని వారు వివరించారు.

5 troops killed in helicopter crash in Afghanistan

భారీ ఉగ్ర కుట్ర భగ్నం

మాస్కో: ఉగ్రవాదులు రష్యా రాజధాని మాస్కోలో సృష్టించతలపెట్టిన పేలుడు కుట్రను రష్యా పోలీసులు భగ్నం చేశారు. ముందుగానే స్పందించి భారీ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా దాన్ని నిర్వీర్యం చేశారు.

వెంటనే వేగంగా స్పందించి చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టి కొందరు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని రష్యా నేషనల్ యాంటీ టెర్రరిస్ట్ కమిటీ స్పష్టం చేసింది. మాస్కోలోని స్ట్రెల్ బిష్ చెంకీ పెరెలాక్ నివాస సముదాయ ప్రాంతాల్లో తొలుత బాంబును గుర్తించారు.

అనంతరం అక్కడే ఉన్న ఇళ్లలో గాలింపులు చేపట్టి కొందరు అనుమానితులను అరెస్టు చేశారు. ఇటీవల ఉగ్రవాదులను అణిచి వేసే చర్యలకు రష్యా వైమానిక దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

English summary
Five members of a NATO-led effort to train and support Afghan military troops -- the Resolute Support Mission -- died Sunday in a helicopter crash, the U.S. military said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X