బర్త్ డే పార్టీకి రాలేదని ఐదేళ్ల బాలుడికి రూ. 1500 జరిమానా!

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తన కొడుకు పుట్టిన రోజు వేడుకలకు పిలిస్తే రాలేదనే నెపంతో ఓ మహిళ ఐదేళ్ల బాలుడికి రూ. 1500 జరిమానా విధించింది. అంతేగాక చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె బెదిరింపులకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే... క్రిస్మస్‌కు కొద్ది రోజుల ముందు జరిగిన పుట్టిన రోజు వేడుకలకు అలెక్స్ నాష్ అనే బాలుడికి అతని ఫ్రెండ్ నుంచి పిలుపువచ్చింది. అయితే, అలెక్స్ ఆ పార్టీకి వెళ్లలేదు. దీంతో పార్టీకి పిలిచిన బాలుడి తల్లి జూలీ లారెన్స్‌కు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

5-year-old boy gets billed for no-show at friend's birthday bash

అలెక్స్ రాకపోవడం వల్ల తనకు అనవసరంగా పెద్ద మొత్తంలో ఖర్చయిందని, రావట్లేదన్న విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. పార్టీ రానందుకు గానూ తాము ఖర్చు చేసిన రూ. 1500 (16 పౌండ్లు) చెల్లించాలని అలెక్స్‌కు ఓ ఇన్వాయిస్ పంపింది.

కాగా, ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని, ఆ డబ్బు ఆమెకు చెల్లించేది లేదని అలెక్స్ తండ్రి డెరెక్ తేల్చి చెప్పాడు. అలెక్స్ తన నాయనమ్మ, తాతయ్యలతో గడపాల్సి వచ్చినందునే.. అలెక్స్ ఆ పార్టీకి వెళ్లలేకపోయాడని తెలిపాడు. ఈ విషయాన్ని చెబుదామంటే లారెన్స్ ఫోన్ నెంబర్ తమ వద్ద లేదని చెప్పాడు. అయితే తాము ఇచ్చిన ఇన్విటేషన్‌లోనే కాంటాక్ట్‌ నెంబర్‌తో సహాఅన్ని వివరాలు ఉన్నాయని లారెన్స్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+