"మగాళ్లు ముద్దులు పెట్టుకోవడం ఇష్టం లేకే చంపేశా"

ఫ్లోరిడా: ఇస్లామిక్ స్టేట్‌కు విధేయత ప్రదర్శిస్తూ సాయుధుడు ఒమర్ మతీన్ నరమేథానికి పాల్పడినట్లు తెలుస్తోందని స్థానిక పోలీసులు చెప్పారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండో సిటీలో జరుగుతున్న గే నైట్ క్లబ్ పార్టీలో 29 సంవత్సరాల ఉన్మాది ఒమర్ సిద్దికీ మతీన్ అమానుషంగా 50 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే.

తన కొడుకు ఇద్దరు మగవాళ్లను ముద్దు పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయాడని, అందుకే అలా చేశాడని అతని తండ్రి మిర్ సిద్దకీ అంటున్నారు. అంతకుముందు కూడా ఇద్దరు మగవాళ్లు ముద్దు పెట్టుకోవడం చూసిన ఒమర్ మతీన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని చెప్పాడు.

50 killed in Florida gay club massacre: The reason behind it

అయితే తన కొడుకు చేసిన దానికి క్షమించాలని, అందరిలాగానే తమ కుటుంబం కూడా షాక్‌కు గురైందని తండ్రి మిర్ సిద్దికీ చెబుతున్నాడు. కాల్పులకు తెగబడడానికి ముందు మతీన్ 911 నెంబర్‌కు ఫోన్ చేసి ఐఎస్ఐఎస్ మద్దతుగానే ఈ పని చేస్తున్నట్లు చెప్పాడని ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ నిఘా హౌస్ సెలెక్ట్ కమిటీ డెమొక్రాట్ సభ్యుడు యాడం ఫిష్ చెప్పారు.

అఫ్గనిస్తాన్ దంపతులకు జన్మించిన ఒమర్ ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడని, గతంలో అతనికి ఏ విధమైన నేర చరిత్ర లేదని పోలీసులు చెప్పారు. ఒమర్‌కు హోమోఫోబియా (స్వలింగ సంపర్క వ్యతిరేకత) ఉందని, అందువల్లనే రంజాన్ నెలలో గే నైట్ క్లబ్ లక్ష్యంగా అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+