ట్రంప్ తీరుపై 56 శాతం అమెరికన్ల అసంతృప్తి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆయన పట్ల ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమౌతోంది. ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న నెలరోజులకే ఆయన పదవి నుండి వైదొలగాలంటూ ఆందోళనలు కూడ నిర్వహించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరశైలి పట్ల అమెరికన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించాల్సిన ట్రంప్ దేశాన్ని విభజించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

56% Americans say Trump 'tearing the country apart'

56 శాతం అమెరికన్లు ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.డెముక్రాట్లలో 93 శాతం ఇలా చెబుతోంటే, రిపబ్లికన్లు మాత్రం ట్రంప్ ఇలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారని 15 శాతం మందే అభిప్రాయపడ్డారు.

ఇక మొత్తం మీద పోల్‌లో పాల్గొన్నవారిలో 33 శాతం ఓటర్లు ట్రంప్ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఉత్తరకొరియా విధానం, రష్యా ,పర్యావరణం, హెల్త్‌కేర్, వర్ణవివక్ష వంటి పలు అంశాల్లో ట్రంప్ పాలనకు నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు.

ఫాక్స్ న్యూస్ పోల్ కూడ ట్రంప్‌కు షాకిచ్చింది. పోల్‌లో ప్రస్తావించిన కీలక అంశాల్లోని ఏ ఒక్క అంశాన్ని కూడ ట్రంప్ సమర్థంగా డీల్ చేస్తున్నారని సర్వేలో పాల్గొన్నవారిలో మెజారిటీ ప్రజలు చెప్పలేదు.అయితే ఆర్థిక అంశాలు మాత్రం ట్రంప్ మెరుగ్గా ఉన్నారని మార్కులిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+