జపాన్‌లో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో ప్రకంపనాలు
జపాన్ రాజధాని టోక్యోలో భారీ భూకంపం వచ్చింది. టోక్యోకి తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్ ప్రధాన కేంద్రంగా గురువారం రాత్రి భూమి కంపించింది. ఈ మేరకు ఆ దేశ మెటరోలాజికల్ ఏజెన్సీ తెలియజేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.1గా ఉంది. భూగర్భానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టు తెలిపింది. భూకంపం వల్ల టోక్యోలో కొన్ని చోట్ల బిల్డింగ్‌లు షేక్ అయినట్లు సమాచారం. భూకంపం కారణంగా పలు బుల్లెట్ ట్రైన్స్ లైన్స్‌ని కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని నిపుణులు తెలిపారు. భూకంపంతో.. ఇళ్లలో ఉన్న జనాలను షెల్టర్‌లకు తరలిస్తున్నారు. భూకంప ప్రభావంతో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియరాలేదు. అమెరికా జియోలాజిస్టులు మాత్రం భూకంప తీవ్రత 5.9 అని.. 61 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెబుతున్నారు.
భూకంపంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని స్థానికులు అంటున్నారు. భూకంపం వల్ల టోక్యోలో గల వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాస్తవానికి జపాన్‌లో భూకంపాలు అరుదుగా వస్తూనే ఉంటాయి. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ప్రధాని ఫ్యూమినో ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications