జపాన్‌ను వణికించిన భూకంపం

టోక్యో: జ‌పాన్‌ దేశాన్ని మరోసారి భూకంపం వణికించింది. బుధ‌వారం రాత్రి ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్ట‌ర్ స్కేల్‌పై 6.4గా న‌మోదైంది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకున్నారు.

ద‌క్షిణ జ‌పాన్‌లోని నాన్యో ప్రాంతంలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయ‌ని జ‌పాన్ మెట‌రాల‌జిక‌ల్ ఏజెన్సీ (జేఎంఏ) వెల్ల‌డించింది. జ‌పాన్ ద్వీపాలు కైకూ, షికోకుల‌ను వేరు చేసే బుంగో చాన‌ల్ భూకంప కేంద్రంగా జేఎంఏ వెల్ల‌డించింది.

6 3 Magnitude Earthquake Hits Western Japan No Tsunami Warning Issued

యువాజిమాకు పశ్చిమాన 18 కిలోమీటర్లు (11 మైళ్లు) 25 కిలోమీటర్ల లోతులో క్యుషు, షికోకు దీవులను వేరుచేసే ఛానెల్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు.

భూప్ర‌కంప‌న‌ల‌తో ఎలాంటి భారీ న‌ష్టం వాటిల్లిన వివ‌రాలు వెల్ల‌డికాలేదు. ఇక‌ట న్యూక్లియ‌ర్ ప్లాంట్‌లో ఆ స‌మ‌యంలో ఒక రియాక్ట‌ర్ ప‌నిచేస్తున్నా దానిపై ఎలాంటి ప్ర‌భావం లేద‌ని షికోకు ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ తెలిపింది. కాగా, అధిక భూకంపాలు చోటు చేసుకునే ప్రాంతంగా పేరుగాంచిన జపాన్.. తరచుగా భూకంపాలను అనుభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 6 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాలలో దాదాపు ఐదవ వంతుగా ఇక్కడ సంభవిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+