అలస్కాలో భూకంపం: 6.4గా తీవ్రత నమోదు, జనం పరుగులు
వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర అలస్కా ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపతీవ్రంత 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్ జియోగ్రాఫికల్ సర్వే ధృవీకరించింది.

అయితే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు ఇంకా సమాచారం అందలేదు. కాగా, పలు ప్రాంతంలో ఇళ్లు, కార్యాలయాలు స్వల్పంగా కదడంతో జనాలు భయంతో బయటికి పరుగులు తీశారు.

కొన్ని ప్రాంతాల్లో భూమి పగుళ్లు సంభవించింది. ఇంత తీవ్రతతో భూకంపం సంభవించడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. 1995లో వచ్చిన భూకంపమే(5.2 మాగ్నిట్యూడ్) ఇప్పటి వరకు అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన తర్వాత పలుమార్లు ప్రకంపనలు కూడా వచ్చాయని జియోగ్రాఫికల్ సర్వే అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications