అమెరికాలోని కాలిఫోర్నియాలో భూకంపం: చైనాలో 140సార్లు కంపించిన భూమి
అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో గురువారం నాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.5గా నమోదయింది.
కాలిఫోర్నియా: అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో గురువారం నాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.5గా నమోదయింది. కాలిఫోర్నియాలోని ఫెర్న్‌డేల్‌కు పశ్చిమాన 150 కిమీ దూరంలో భూమికి 10 కి.మీ. అడుగున భూకంపకేంద్రాన్ని గుర్తించారు

భూఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోపల భూమి కంపించినట్లు అమెరికా జియాలోజికల్ సర్వే డిపార్టుమెంట్ పేర్కొంది. సునామీ సంభవించే అవకాశం లేదని చెప్పింది.
శాన్ ఫ్రాన్సిస్కోలోను భూప్రకంపనలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇరవై సెకన్లు కంపించినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. అయితే జియాలాజికల్ సర్వే ధృవీకరించలేదు. 2010లో కాలిఫోర్నియాలో రిక్టర్ స్కేల్ పైన 6.5 తీవ్రత భూకంపం వచ్చింది. అప్పుడు పవర్ లైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితరాలు దెబబ్తిన్నాయి.
భూకంపం చైనాను కూడా వణికించింది. వాయవ్య చైనాలోని హుటుబి కంట్రీ, యురింకీ, చాంగ్లీలలో భూకంపానికి భయపడి ప్రజలు బయటే గడిపారు. యురింకీలో భూమి 140సార్లు కంపించింది. ఇందులో ఆరుసార్లు రిక్టర్‌స్కేల్‌పై 3 నుంచి 3.9గా భూకంప తీవ్రత నమోదైంది. కాగా, ఇండోనేసియాలో బుధవారం సంభవించిన భూకంపానికి మృతి చెందినవారి సంఖ్య గురువారానికి 102కు చేరింది. అయితే, అమెరికా, చైనాలలో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications