వేర్వేరు చోట్ల పేలిన లెటర్ బాంబులు: 6గురు మృతి
బీజింగ్: చైనాలో లెటర్ బాంబులు పేలిన ఘటనలో ఆరుగురు మరణించగా, 13మందికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం చైనాలోని గ్వాంఝై ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలతో సహా పదికిపైగా ప్రాంతాల్లో 15 లెటర్ బాంబులు పేలాయి.
చైనా జాతీయ దినోత్సవం రోజునే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్వీడ్ డెలివరీ ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలను అమర్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు దుండగులు. లెటర్ బాంబుల పేలుడుతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. కాగా, జైలు, ప్రభుత్వ కార్యాలయం, షాపింగ్ సెంటర్లలో ఈ లెటర్ బాంబులు పేలాయి. ఓ భవంతి సగానికి కూలిపోగా, రోడ్డుపై పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

భవన శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది శిథిలాలను తొలగిస్తే గానీ తెలియదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేర్వేరు పేలుడు పదార్థాలతో నిందితులు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, ఈ పేలుళ్లకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
ఐఎస్ఐఎస్‌పై దాడి నిర్ణయానికి రష్యా పార్లమెంటు ఆమోదం
సిరియాలో రక్తపాతం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై దాడులు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా పార్లమెంటు బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో రష్యా సైనిక బలగాలు సిరియాకు వెళ్లి అక్కడ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడనున్నాయి.












Click it and Unblock the Notifications