బాత్రూంలో ఊపిరాడక ఆరుగురు మృతి
ఇండోనేషియా రాజధాని జకార్తాలో దోపిడీ దుండగులు ఓ ఇంట్లోని వారినిని బాత్రూంలో బంధించగా ఊపిరాడక వారిలో ఆరుగురు మృతి చెందారు.
జకార్తా: దోపిడీకి వచ్చిన వారు ఇంట్లోని వారిని చిన్న బాత్రూంలో బంధించిన ఘటనలో ఊపిరాడక ఆరుగురు మృతి చెందిన ఉదంతమిది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

కత్తులు, తుపాకులతో సోమవారం ఓ ఇంటికి దోపిడీకి వచ్చిన సదరు దుండగులు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు, పని వారు, డ్రైవర్ సహా మొత్తం 11 మందిని బాత్రూంలో బంధించగా ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతులలో తొమ్మిదేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు.
బాత్రూం గది అతి చిన్నగా ఉండడంతో ఊపిరాడక వీరిలో ఆరుగురు మృతి చెందగా, మరో 5 మంది కొనప్రాణంతో బయట పడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ అకృత్యం గురించి ఓ పౌరుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకొని బాత్రూం తలుపు విరగగొట్టి కొనప్రాణంతో కొట్టుకుంటున్న బాధితులను కాపాడారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంట్లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దోపిడీ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications