వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయికి ముద్దు: ఆరేళ్ల బాలుడి సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

boy
డెన్వర్: అమెరికాలోని కొలరేడో రాష్ట్రంలోని డెన్వర్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు డెన్వర్‌లోని కెనాన్‌లోని పాఠశాలలో ఓ బాలికను ముద్దు పెట్టుకున్నాడు. అయితే దీన్ని లైంగిక వేధింపులుగా పరిగణించిన యాజమాన్యం ఆ బాలుడ్ని పాఠశాల నుంచి సస్పెండ్ చేసింది. కాగా పాఠశాల యాజమాన్యం చిన్న విషయం పట్ల అతిగా స్పందించి తమ కుమారుడ్ని సస్పెండ్ చేయడం దారుణమని బాలుడి తల్లి జెన్నిఫర్ సాండర్స్ ఆరోపించింది.

బాలికను ముద్దు పెట్టుకున్న సంఘటన కంటే ముందు కూడా ఇతర క్రమశిక్షణా చర్యలని చెప్పి తన కుమారుడ్ని పాఠశాలకు దూరం చేశారని, ఇప్పుడు మళ్లీ కొన్ని రోజులు సస్పెండ్ చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సాండర్స్ చెప్పింది. కాగా ఆ బాలికను బాలుడు ప్రేమిస్తున్నాడని, అదే సమయంలో బాలిక కూడా బాలుడ్ని ఇష్టపడుతోందని పాఠశాలలో ఫస్ట్ గ్రేడర్ హంటర్ యెల్టన్ మీడియాకు తెలిపాడు.

తాము క్లాసులో చదువుకుంటున్న సమయంలో ఆ బాలుడు బాలిక చేయిపై ముద్దు పెట్టుకున్నాడని యెల్టన్ చెప్పాడు. అయితే బాలుడి తల్లి మాత్రం తన కుమారుడి తప్పు ఏమి లేదని, ఇది ఒక రకమైన ఆకర్షణ మాత్రమేనని పేర్కొంది. పేరెంట్స్ మీటింగ్‌లో తన కుమారుడిపై లైంగిక వేధింపులు ఆరోపణలను పాఠశాల యాజమాన్యం వ్యక్తం చేయడం తనను షాక్‌కు గురి చేసిందని తెలిపింది.

తన ఆరేళ్ల కుమారుడిపై ఇలాంటి దారుణమైన ఆరోపణలు రావడంతో చాలా ఆశ్చర్యానికి గురయ్యానని సాండర్స్ పేర్కొంది. ఇప్పుడు తన కుమారుడు సెక్స్ అంటే ఏమిటి అని తనను అడుగుతున్నాడని ఆమె చెప్పింది. ఆరేళ్ల తన కుమారుడిపై ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదని ఆమె చెప్పారు. కాగా అవాంఛితంగా స్పృశించిన నేరం కింద ఆ బాలుడ్ని సస్పెండ్ చేసినట్లు జిల్లా సూపరింటెండెంట్ రాబిన్ గూల్డీ మీడియాకు తెలిపారు. ఆ బాలుడు పలుమార్లు పాఠశాల నియమాలను ఉల్లంఘించినందువల్లే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

English summary
The suspension of a 6-year-old boy for kissing a girl at school is raising questions about whether the peck should be considered sexual harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X