యువతిని పెళ్లాడిన వృద్ధమంత్రి, చిన్నారిని చంపిన పులి
ఢాకా: 67 ఏళ్ల ముసలి వ్యక్తి ఒకరు ముప్పయ్యేళ్లు కూడా నిండని ఓ యువతిని పెళ్లాడాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. పైగా ఆయన బంగ్లాదేశ్ రైల్వేశాఖ మంత్రి కూడా కావడం గమనార్హం. ముజీబుల్ హఖ్ అనే ఈ మంత్రి 29 ఏళ్ల యువతి హనూఫా అఖ్తర్ రిక్తాను పెళ్లాడాడు.
ఆమె ఇంట్లో జరిగిన ఈ వేడుకలో మంత్రిగారు కబీన్ నామా (పెళ్లి ఒప్పందం) పైన సంతకం చేశారు. ఇందుకు గానూ అమ్మాయి కుటుంబానికి ఐదు లక్షల టాకాలను హక్ చెల్లించారు. ఈ వేడుకకు మంత్రి తరఫున 700 మంది చుట్టాలొచ్చారట. 67 ఏళ్ల ఈ ముసలి వ్యక్తి 29 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి
నేపాల్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.
చైనాలో సర్కస్ పులికి చిన్నారి బలి
నెల క్రితం ఢిల్లీలో ఓ యువకుడు పులి ఎన్‌క్లోజర్‌లో పడి.. దాని దాడికి గురై మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే చైనాలో సంభవించింది. సర్కస్ పులి నోటికి 8 ఏళ్ల చిన్నారి బలైంది.
నైరుతి చైనాలోని లెహెలెదు అమ్యూజ్‌మెంట్ పార్కులో ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పులికి శిక్షణ ఇచ్చే ప్రాంతంలోకి పొరపాటున ఆ పాప జారిపడటంతో.. విషాదం నెలకొంది. పులి పంజా ధాటికి తీవ్రగాయాలైన ఆ చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. సంఘటనతో పార్కులో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఆ చిన్నారి తల్లిదండ్రులతో పార్కు ఒప్పందం చేసుకుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications