చనిపోయి 11 నిమిషాల తర్వాత బతికిన బామ్మ.. స్వర్గం గురించి షాకింగ్ విషయాలు వెల్లడి..!!
Trending News: మనిషి చనిపోయిన తర్వాత స్వర్గం లేదా నరకానికి వెళతారని హిందువులు నమ్ముతుంటారు. భారతీయ సినిమాల్లో మరణం తర్వాత ఆత్మకు ఏమౌతుందనే నేపథ్యంలో వందల సంఖ్యలో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటివి వాస్తవంగా ఉంటాయా అనే దానికి ఇప్పటికే చాలా సార్లు నిదర్శనం కనిపించింది.
ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన గురించి కాన్సాస్ కు చెందిన 68 ఏళ్ల షార్లెట్ హోమ్స్ అనే మహిళకు నిజంగా జరిగింది. అవును 2019లో అధిక రక్తపోటుకి సంబంధించిన పరీక్షల సమయంలో మరణానికి సమీపంలో ఉన్న అనుభవాన్ని ఎదుర్కొంది. ఆమె పరిస్థితి కొన్ని సెకన్ల వ్యవధిలో మరింత దిగజారింది. ఈ క్రమంలో ఆమె వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించబడ్డారు. అయితే ఇది జరిగిన 11 నిమిషాల తర్వాత ఆమె తిరిగి బతికారు. ఈ కొన్ని నిమిషాల సమయంలో ఆమెకు కలిగిన ఆశ్చర్యకరమైన అనుభూతిని పంచుకున్నారు.

ముందుగా ఆమె తన శరీరం పైన తేలియాడుతున్నట్లు భావనను పొందింది. అక్కడ ఉన్న వైద్యుల బృందం ఆమెను తిరిగి బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చూస్తుంది. వారు ఛాతీ కుదింపులు చేయడాన్ని తాను చూడగలిగానని, గదిలో గందరగోళం, శబ్దం గురించి ఆమె వివరించింది. ఈ కొద్ది నిమిషాల్లో ఆమె ప్రయాణం స్వర్గంలోని అందమైన దృశ్యానికి తీసుకెళ్లిందని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రకాశవంతమైన రంగులు, దట్టమైన పచ్చదనం, అందమైన పువ్వులతో అసాధారణమైన అందమైన పరిసరాలను చూసినట్లు ఆమె స్పష్టంగా వివరించింది. సృష్టి అంతా భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా అంతా సంగీతం, ఆనందంతో నిండిపోయిందని వెల్లడించింది. తనకు ముందుగా తన మరణించిన కుటుంబ సభ్యులు కనిపించారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆమె తన కుమారుడిని చూసినట్లు పేర్కొన్నారు. స్వర్గంలో ఆత్మలు పెరుగుతూనే ఉంటాయని దేవుడు తనకు చెప్పాడని ఆమె పేర్కొంది. దీంతో మరణం తర్వాత జీవితం ఉంటుందని ఆమె తన అనుభవాన్ని వెల్లడించారు. ఈ 11 నిమిషాల మరణ సమయంలో ఆమె నరకానికి సంబంధించిన భయంకరమైన విజువల్స్, శబ్ధాలు, విపరీతమైన వాసనలు, దూరం నుంచి అరుపులు వంటి వాటిని కూడా చూసినట్లు పేర్కొంది. జీవితంలో మనిషి చేసే పనుల వల్ల పర్యవసానాలను గురించి హెచ్చరించటానికి దేవుడు వాటిని కూడా చూపించాడని ఆమె అన్నారు. దీని తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె రెండు వారాల్లో పూర్తిగా కోలుకున్నారు. షార్లెట్ హోమ్స్ తన 72వ ఏటలో నవంబర్ 28, 2023న మరణించే వరకు ఈ విషయాలను అనేక మందితో పంచుకున్నారు.












Click it and Unblock the Notifications