అదృష్టం: విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఏడేళ్ల చిన్నారి

న్యూయార్క్: అమెరికాలోని కెంటకీలో జరిగిన విమాన ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం ఫ్లోరిడాలో ఒక చిన్న విమానం బయలుదేరింది. అందులో నలుగురు పెద్దలు, ఒక ఏడేళ్ల పాప ఉన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ విమానం దట్టమైన వృక్షాలున్న ప్రాంతంలో కూలిపోయింద

దీంతో విమానాశ్రయ అధికారులకు ఆ విమానం గురించిన సమాచారం అందలేదు. అయితే ప్రమాదంలో నలుగురు పెద్దలు మృతి చెందగా, అనూహ్య పరిస్థితుల్లో ఏడేళ్ల పాప మాత్రం చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత రెండు మూడు గంటలకు కెంటకీలోని లయన్‌ కౌంటీలోని ఓ ఇంటికి వెళ్లిన ఆ పాప తలుపు కొట్టింది. ఇంటి యజమాని తలుపు తీసి చూస్తే ఏడేళ్ల పాప కనిపించింది.

7-year-old survives plane crash that kills 4 in Kentucky

శరీరంపై కాస్త గాయాలు ఉన్నాయి గాని అవేమంత పెద్దవి కావు. ఆ పాప ఇంటి యజమానికి జరిగిన విషయాన్ని తెలిపింది. అంత పెద్ద ప్రమాదంలో చిన్న చిన్న గాయాలు మాత్రమే తగిలి, నలుగురు పెద్దవాళ్లు మరణిస్తే ఈ పాప ఒక్కతే బ్రతికిందా, పైగా నడుచుకుంటూ ఈ రాత్రి వేళ వచ్చిందా అని ఆశ్చర్యానికి గురైన ఆ ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.

విమానం కూలిపోవడంగురించి సమాచారం లేని పోలీసులకు ఆ మాటలు నమ్మశక్యంగా కనిపించనప్పటికీ పాపను చూడడానికి వచ్చారు. పాప కొంత మానసికంగా ఆవేదనగా ఉండటం గుర్తించి వెంటనే పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.

కాగా, పాప చెప్పిన వివరాల ప్రకారం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా కూలిపోయిన విమాన శిథిలాలు కనిపించాయి. ఆ సమీపంలోని సరస్సులో విమానంలోని నలుగురి మృతదేహాలు లభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+