ఆమె 71, అతను 16: ప్రేమలో ఎంత దగ్గరయ్యారంటే.. పెళ్లి చేయకపోతే చస్తామని!
గ్రామానికి చెందిన చెందిన 71 ఏళ్ల రోహయా అనే మహిళ.. 16 ఏళ్ల సేలమత్ రియాదితో ప్రేమలో పడింది.
ఇండోనేషియా: అతను 16.. ఆమె 71.. ప్రేమ పుట్టడానికి వయసుతో నిమిత్తం లేకపోవచ్చు కానీ వయసు ఉడిగిపోయిన వృద్దురాలికి, ఇంకా మీసం కట్టు కూడా రాని బాలుడికి పెళ్లంటే.. కాస్త విచిత్రమే.ఇండోనేసియాలోని దక్షిణ సుమత్రా ప్రాంతంలోని కరన్‌గెండా గ్రామం ఇలాంటి పెళ్లికి వేదికైంది.
గ్రామానికి చెందిన చెందిన 71 ఏళ్ల రోహయా అనే మహిళ.. 16 ఏళ్ల సేలమత్ రియాదితో ప్రేమలో పడింది. అంతేకాదు, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే రోహయాకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరగడంతో.. ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. పైగా సేలమత్ వయసుకు కాస్త అటూ ఇటుగా 19ఏళ్ల వయసున్న కొడుకు రోహయాకు ఉన్నాడు.

దీంతో కుటుంబ పరువు పోతుందని ఇలాంటి పెళ్లి వద్దని రోహయా తరుపువారు మొత్తుకున్నారు. కానీ రోహయా వారి మాట వినలేదు. ఇటు సేలమత్ కూడా అతి కష్టం మీద తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాడు. పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కూడా బెదిరించారు. చివరకు, సేలమత్ కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి జరిగిన రోజు చుట్టు పక్కల గ్రామస్తులంతా వచ్చి దీన్నో వింతగా తిలకించారు. ఇండోనేషియాలో ఇప్పుడిదో హాట్ టాపిక్.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications