ప్రపంచంలోని ప్రభావశీల వ్యక్తి మోడీ గురించి కెనడాలో 75 శాతం మందికి తెలియదు

ఒట్టావా: భారత ప్రధాని నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. పలు సర్వేలు ఆయనకు ఉన్న పాపులారిటీని తెలిపాయి. సోషల్ మీడియాలోను ఆయన ఎంతో చురుగ్గా ఉంటారు. ఇదిలా ఉండగా, కెనడాలో 75 శాతం మందికి మోడీ ఎవరో తెలియదని యాంగస్ రీడ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో తేలింది.

ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఒకరైన మోడీ గురించి కెనడా వాసుల్లో ఎక్కువ మందికి తెలియదు. ఆ దేశంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. క్యూబెక్‌ ప్రావిన్స్‌లోని ఛార్లోవిక్స్‌ ప్రాంతంలో జీ7 నేతల సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ప్రపంచ నేతల గురించి కెనడావాసులకు ఎంతమేర తెలుసనే దానిపై సర్వే నిర్వహించింది.

75% Canadians do not know Narendra Modi: Survey

24 పదాలను ఇచ్చి పలువురు ప్రపంచ నేతల్లో ఎవరు దేనికి సరిపోతారనే దానిపై సర్వే నిర్వహించింది. అయితే ఇందులో మోడీ గురించి కెనడియన్లను అడగ్గా దాదాపు 75 శాతం మంది అసలు మోడీ ఎవరో తెలియదన్నారు. మరికొంతమంది ఆయనను గుర్తించారు. ఆయన ప్రభావవంతమైన, వ్యూహాత్మక, బలమైన నేతగా చెప్పారు.

ఇక ఈ సర్వేలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి వారి అభిప్రాయాన్ని అడగ్గా ఆయనో అహంకారి అని ఎక్కువ మంది చెప్పారు. 74 శాతం మంది ట్రంప్‌ అహంకార స్వభావం కలిగిన వ్యక్తి అని చెప్పారు. మరి కొందరు అబద్ధాలకోరు, రౌడీ, మోసం చేసే వ్యక్తి, అవినీతిపరుడన్నారు. 2014లోను ఏఆర్‌ఐ ఇదే విధంగా సర్వే చేసింది.

అప్పుడు బరాక్‌ ఒబామా గురించి అడగ్గా ప్రభావవంతుడు, ఆకర్షణీయుడు, స్ఫూర్తినిచ్చేవాడని, దయాహృదయం కలవాడని, నమ్మదగిన వ్యక్తి అని చెప్పారు.
సొంత అధ్యక్షుడైన జస్టిన్‌ ట్రూడో గురించి అడిగితే ఆయన ఆకర్షణీయమైన వ్యక్తి అని ఎక్కువ మంది చెప్పారు. మరికొంతమంది మాత్రం బలహీనమైన వ్యక్తి అన్నారు. పొగరుబోతు అని కూడా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+