ఈఫిల్ టవర్ ప్రేమ: ఈ లోకంతో మాకేం పని ఉంది
బ్రెజిల్: లావుగా ఉన్నారని, సన్నగా ఉన్నారని, నల్లగా ఉన్నారని, పొట్టిగా ఉన్నారని, పోడువుగా ఉన్నారని ఇలా రకరకాల కారణంగా ప్రేమ విఫలమై చాల మంది ప్రేమ వివాహాలు నిలిచిపోతుంటాయి. అయితే ప్రేమ ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరికి తెలుసు. ప్రేమ కాన్సెప్ట్ తో ప్రపంచంలోని ఏ భాషలో సినిమా తీసినా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.
ఇప్పుడు బ్రెజిల్ లో ఎక్కడ చూసిన ఒక ప్రేమ జంట గురించి చర్చించుకుంటున్నారు. ఈ ప్రేమజంట ప్రత్యేకత ఏమిటి అంటారా, కచ్చితంగా ప్రత్యేకత ఉంది. అబ్బాయి పొడువు ఎంత అని తెలుసుకుంటే ముక్కన వేలు వేసుకుంటారు. కచ్చితంగా 7 అడుగుల 8 అంగులాలు. బ్రెజిల్ లో అతి ఎత్తైన మనిషిగా జెంటిల్ జైంట్ అనే అవార్డును ఇతను సోంతం చేసుకున్నాడు. అతనే జోలిసన్ ఫెర్నాండజ్ ద సిల్వ.
బ్రెజిల్ కు చెందిన జోలిసన్ ఫెర్నాండజ్ ద సిల్వ (27) పట్టుకతోనే పొడువుగా ఉన్నాడు. అతనికి వయస్సు వచ్చే కొద్ది చాలా పొడుగు అయిపోతూ వచ్చాడు. సిగ్గుతో చదువుకు స్వస్తి చెప్పాడు. చివరికి ఇంటికే పరిమితం అయ్యాడు. అయితే ఒక వైద్యుడి పుణ్యమా అంటూ ఫెర్నాండజ్ ద సిల్వకు అపరేషన్ చేశారు.

అపరేషన్ సక్సస్ కావడంతో అతని పొడువు పెరగడం ఆగిపోయింది. అయితే అప్పటికే అతను 7 అడుగుల 8 అంగులాలు ఉన్నాడు. ఒక సారి షాపింగ్ కు వెళ్లిన సమయంలో ఇమెమ్ మోడోరియస్ అనే మహిళ ఇతని కంటపడింది. మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోయాడు.
వెంటనే మొహమాటం లేకుండా ఐ లవ్ యూ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. ధైర్యం చేసి వెళ్లి ప్రేమిస్తున్నాని చెప్పాడు. ఇమెమ్ సైతం ప్రేమించడానికి ఓకే చెప్పింది. అంతే ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం మొదలు పెట్టారు. చూసిన వాళ్లు ఇదేమి జంట అని ముక్కున వేలు వేసుకున్నారు.
అయితే బయటి ప్రపంచంతో మాకు పనిలేదు, మా సంతోషం మాకు ముఖ్యం అంటూ ఇద్దరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమకు కులం, మతం, లావు, పొడవు, రంగు ఇలాంటివి ఏమి ఉండవని ఈ జంటను చూస్తే అర్థం అవుతుంది.












Click it and Unblock the Notifications