2016లో జరిగేవి ఇవే: నోస్ట్రడోమస్ చెప్పింది జరిగేనా?
శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని అనే విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన చెప్పినట్లుగా అంతా జరుగుతుందని చాలామంది భావిస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగే.. నోస్ట్రడోమస్ కూడా ఉన్నారు. ఆయన 14వ సెంచరీ వ్యక్తి. అతను కూడా ఎన్నో విషయాలు ముందుగానే చెప్పారు.
అలాగే, 2016లో ఏం జరుగుతాయనే కొన్ని విషయాలను ఆయన చెప్పేశారు. అవి నిజమవుతాయా తెలియాల్సి ఉంది. ఈయన చెప్పినవి చాలా గతంలో నిజమయ్యాయని అంటుంటారు. అలాగే విమర్శలూ ఉన్నాయి.

2016కు సంబంధించి ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇవే...
- అమెరికాకు నల్లజాతీయుడు చివరి అధ్యక్షుడు (బరాక్ ఒబామా ఈ ఏడాది అమెరికా అధ్యక్ష పీఠం దిగనున్నారు)
- వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకోవడం
- ఖగోళంలో మార్పులు..గతితప్పే గ్రహాల స్థితిగతులు
- మిడిల్ ఈస్ట్‌లో భారీ అగ్నిప్రమాదాలు
- మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో విస్ఫోటనాలు జరుగుతాయి. 2016లో విమానాలు కిందపడతాయి.
- ప్రపంచం అంతమవుతుంది
- వైట్ హౌస్‌లో అరాచకాలు, ప్రపంచాన్ని అంతం చేసేందుకు ప్రణాళికలు
- సౌత్, నార్త్ పోల్స్ కరుగుతాయి.
- రష్యా శాంతి సందేశం
- ఆర్థిక స్థితిగతులు తలకిందులు
- చనిపోయినవారు తిరిగొస్తారు
- జెరూసలేం పైన ఉద్యమం












Click it and Unblock the Notifications