8మంది యువతులు.. రాత్రిపూట ఆ ఫ్లాట్‌లో: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి!
జ్లీబ్ అల్ షుయోఖ్ ప్రాంత పరిధిలో ఉన్న ఒక ఫ్లాట్‌లో కొంతమంది యువతులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కువైట్: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో కువైట్ పోలీసులు కొంతమంది విదేశీయులను అరెస్టు చేశారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు నివసిస్తున్న ఫ్లాట్ మీద పోలీసులు దాడి చేశారు.
ఈ దాడుల్లో ఆసియన్ దేశాల వలస నుంచి వచ్చిన 8 మంది యువతులను, ఇద్దరు వ్యక్తులను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జ్లీబ్ అల్ షుయోఖ్ ప్రాంత పరిధిలో ఉన్న ఒక ఫ్లాట్‌లో కొంతమంది యువతులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

కొంతమంది వ్యక్తులు రాత్రివేళల్లో ఇక్కడికి వచ్చి వెళ్లడం.. అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానాలు కలిగించాయని స్థానికులు పోలీసులతో చెప్పారు. దీంతో అర్థరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా యువతులు ఉంటున్న ఫ్లాట్ వద్దకు పోలీసులు వెళ్లారు.
తలుపు చప్పుడు కాగానే.. లోపలి నుంచి ఓ వ్యక్తి గడియ తీశాడు. దీంతో లోపల జరుగుతున్న తంతు చూసి పోలీసులు షాక్ తిన్నారు. లోపల వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 8మంది యువతులు, ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ఐదుగురు విటులను కూడా అరెస్టు చేశారు. విజిటింగ్ వీసాపై వచ్చిన వీరు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారని, వీళ్ల శిక్షా కాలం ముగిశాక దేశం నుంచి బహిష్కరిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications