టీనేజ్ మాజీ ప్రేయసిపై 80 ఏళ్ల వృద్ధుడి యాసిడ్ దాడి

లండన్: తనను వదిలేసిందనే ఆగ్రహంతో ఓ 80 ఏళ్ల పాకిస్తాన్ సంతతి వృద్ధుడు తన టీనేజ్ మాజీ ప్రేయసిపై యాసిడ్ దాడి చేయించాడు. యుకెలో ఈ ఘటన జరిగింది. అతనికి కోర్టు శుక్రవారంనాడు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్ల క్రితం డిసెంబర్ 12వ తేదీన మొహమ్మద్ రఫీక్ తన మాజీ ప్రేయసి విక్కీ హోర్స్‌మన్‌పై దారుణంగా యాసిడ్ దాడి చేశాడు.

దాడి జరిగినప్పుడు ఆమెకు 18 ఏళ్ల వయస్సు ఉంది. ప్రస్తుతం ఆమెకు 20 ఏళ్ల వయస్సు. తమ మధ్య సంబంధం తెగిపోయిన తర్వాత యాసిడ్ దాడి చేయడానికి రఫీక్ ఇద్దరు వ్యక్తులకు 50 పౌండ్లు ముట్టజెప్పాడు. వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లోని ఇంట్లో ఆమెపై దాడి చేసేందుకు కుట్ర చేసిన షామోనో హీప్స్ (23), స్టీవెన్ హోమ్స్‌ (25)లను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.

80-year-old man jailed for acid attack on teen ex-lover

వారిద్దరికి వరుసగా 12 ఏళ్లు, 18 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు బిబిసి తెలిపింది. 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు హోర్స్‌మన్ రఫీక్‌తో సంబంధం పెట్టుకుందని కోర్టుకు విన్నవించారు. తనతో సంబంధం తెంచుకోవడంతో ఆగ్రహించిన రఫీక్ ఆమెపై ప్రమాదకరమైన ద్రవంతో దాడికి హీప్స్‌, హోమ్స్‌ను కుదుర్చుకున్నాడు.

ఆమె ఇంటి తలుపు తీయగానే ఆమె ముఖంపై ఓ వ్యక్తి యాసిడ్ చల్లాడు. దాంతో ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడింది. ముఖానికి, మెడకు, కాలి పైభాగానికి ప్రత్యేకమైన శస్త్ర చికిత్స అవసరమైంది. రఫీక్ కూడా ఆ దాడిలో స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడిగా గుర్తించి అతనికి తొలుత చికిత్స అందించారు. అయితే తర్వాత అతనిపై అభియోగాలు మోపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+