చైనీస్ నూడుల్స్ తిని 9 మంది మృతి - ఆ ఫుడ్‌ను చెత్తబుట్టలో పారేయండి - ఆరోగ్య శాఖ ఆదేశం
ప్రపంచం నలుమూలలకు విస్తరించిన చైనీస్ వంటకం నూడుల్స్ కు సంబంధించి మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు నూడుల్స్ తిని, ఆ సూప్ తాగడంతో మృత్యువాత పడ్డారు. నూడుల్స్ లో మోతాదుకు మించి ప్రమాదకర సీసం, యాసిడ్స్ ఉంటాయని ఇదివరకే కొన్ని ఆరోపణలు రాగా, వాటి తయారీ సంస్థలు వివరణలతో సరిపెట్టాయి. అయితే, ఈ ఘటనలో మాత్రం ఇంట్లో తయారు చేసుకున్న నూడుల్స్ ఆ కుటుంబం కొంపముంచాయి. దీనిపై ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

సంప్రదాయ వంటకం..
నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. అక్కడి హెయిలాంగ్జియాన్ ఫ్రావిన్స్, జిడాంగ్ కౌంటీలో నూడుల్స్ తిన్న తొమ్మిది మంది చనిపోయినట్లు చైనీస్ అధికారిక మీడియా ప్రకటించింది. చైనాలో మొక్కజొన్న పిండితో తయారైన నూడుల్స్ తో వండే ‘స్వాన్ తాంగ్ జీ' వంటకాన్ని ఉదయం అల్పాహారంగా తీసుకుంటారు. అలా జిడాంగ్ కు చెందిన 12 మంది సభ్యుల కుటుంబం అక్టోబర్ 5న బ్రేక్ ఫాస్ట్ గా నూడుల్స్ సూప్ ను తీసుకున్నారు. దాని రుచి అదోలా ఉండటంతో ముగ్గురు మాత్రం నూడుల్స్ తినకుండా వదిలేశారు. తిన్న 9మంది గంటల వ్యవధిలోనే ఒకరితర్వాత ఒకరుగా ఆస్పత్రిపాలయ్యారు. సోమవారం నాటికి తొమ్మిదో వ్యక్తి చనిపోయారు.

అసలేం జరిగిందంటే..
సంప్రదాయ వంటకంగా భావించే ‘స్వాన్ తాంగ్ జీ' కోసం మొక్క జొన్న పిండితో నూడుల్స్ చేసి, వాటిని పులియబెడతారు(ఫెర్మెంటేషన్). ఇది సహజంగా జరిగే ప్రక్రియే అయినప్పటికీ, జిడాంగ్ లో మృత్యువాత పడిన ఆ కుటుంబం.. ఏడాదికి పైగా ఫ్రిజ్ లో ఉంచిన నూడుల్స్ ను వండి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అధికారిక మీడియా తెలిపింది. ఎక్కువకాలం పులియబెట్టిన నూడుల్స్ లో బ్యాక్టీరియాల కారణంగా ప్రమాదకరమైన యాసిడ్స్ తయారవుతాయని, తిరిగి మరగబెట్టుకుని తిన్నా దాని ప్రభావం అలాగే ఉంటుందని, కాబట్టే ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే..

ఆ ఫుడ్ తినొద్దంటూ ఆదేశాలు..
ఒకే కుటుంబానికి చెందిన 9 మంది నూడుల్స్ పాయిజన్ వల్ల చనిపోవడంతో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) అప్రమత్తమైంది. ప్రజలెవరూ పులియబెట్టిన నూడుల్స్ ను తినొద్దని, ఇంట్లో నిల్వఉంచిన అలాంటి పదార్థాలను వెంటనే చెత్తబుట్టలో పారేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఫెర్మెంటేషన్ ఫుడ్ సేఫ్ కాదని, గడిచిన 10 ఏళ్లలో మొత్తం 84 మంది పాయిజన్ కు గురికాగా, 37 మంది ప్రాణాలు కోల్పోయారని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది. అయితే దీనిపై చైనీస్ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications