అమెరికాలోని ఓహియో నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్ధరాత్రి తర్వాత ఆదివారం వేకువజామున ఓహియోలోని ఓ క్లబ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్ధరాత్రి తర్వాత ఆదివారం వేకువజామున ఓహియోలోని ఓ క్లబ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఈశాన్య కొలంబస్‌లో తెల్లవారుజామున తమకు కాల్పులకు సంబంధించిన సమాచారం అందిందని, అక్కడకు వెళ్లి చూసేసరికి భయానక వాతావరణం కనిపించిందని చెప్పారు. కాల్పులు ఎవరు జరిపారనే విషయం తేలలేదని, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications