వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9ఏళ్ల బాలిక థర్డ్‌ఫ్లోర్ నుంచి దూకింది, పోలీసుల క్యాచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: అగ్ని ప్రమాదం నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఓ తొమ్మిదేళ్ల బాలిక ఏకంగా 25 అడుగుల ఎత్తు నుంచి దూకింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఆ చిన్నారి పేరు సోఫియా దొరొషెంకో.

ఉక్రెయిన్‌కు చెందిన సోఫియా కుటుంబం అమెరికాకు ఇటీవలే వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో నివాసం ఉంటోంది. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఇంట్లో సోఫియా ఒక్కతే ఉంది. మంటలు వ్యాపిస్తుండటంతో తీవ్ర భయాందోళనకు గురై బాల్కనీలోకి వచ్చి నిలబడింది.

9 year old girl jumps from balcony to escape burning condo

సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు మూడో అంతస్తు బాల్కనీలో సోఫియాను చూసి కిందకు దూకమంటూ అరిచారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అప్పటికి ఇంకా రాకపోవటంతో సోఫియా కిందికి దూకితే పట్టుకోవటానికి వల గానీ, రబ్బరు ప్యాడ్‌లుగానీ లేవు.

అయినప్పటికీ పోలీసులు తమ చేతులతోనే సోఫియాను పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. సోఫియా ధైర్యం చేసి కిందికి దూకడంతో ముగ్గురు పోలీసులు చేతులు చాచి ఆమెను భద్రంగా పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

English summary
9 year old girl jumps from balcony to escape burning condo, caught by police officers in mahwah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X