రెండో అంతస్తులో 'భారీ' మహిళ:క్రేన్‌తో కిందకి దించారు
న్యూయార్క్: అమెరికాలో స్థూలకాయంతో బాధపడుతున్న ఓ మహిళను తన నివాసం నుంచి ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు భారీ క్రేన్ వచ్చింది. తూర్పు హర్లెంలో శుక్రవారం నాడు మహిళకు పరీక్షలు నిర్వహించేందుకు ప్యారా మెడికల్ సిబ్బంది వచ్చారు.
అపార్టుమెంట్లో రెండో అంతస్తులో ఉంటున్న ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే ముందున్న తలుపు సరిపోదు. దీనిని గ్రహించిన అగ్నిమాపక సిబ్బంది సహాయం కోరారు. దీంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది ఇంటి వెనుక కిటికీని తొలగించారు.

అక్కడి నుంచి మహిళను బయటకు తరలించారు. మహిళను వలలో ఉంచి క్రేన్ ద్వారా బయటకు తీశారు. ప్రస్తుతం మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమె సుమారు 360 కిలోల బరువు ఉందని చెబుతున్నారు.
భారీ బరువు కలిగిన ఆ మహిళ మాట్లాడుతూ.. తనకు బతకాలని ఉందని చెప్పింది. భారీ బరువుతో ఇబ్బంది పడుతున్నానని, దీంతో, బరువు తగ్గాలనుకుంటున్నట్లు చెప్పింది. ఆమె పేరు మారీ బౌమన్. వయస్సు 70 ఏళ్లు. ఆమె గతంలో అపార్టుమెంటు నుంచి 2014 సెప్టెంబర్ నెలలో బయటకు వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆమె భారీగా లావెక్కింది. దీంతో క్రేన్ ఉపయోగించవలసి వచ్చింది.












Click it and Unblock the Notifications