Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

92ఏళ్ల వయసు.. 97మంది భార్యలు.. 'నో ఫుల్ స్టాప్' అంటున్నాడు

నైజీరియా : ఇప్పటికే 97 మందిని వివాహం చేసుకుని.. 180మందికి పైగా పిల్లలను కన్న ఇస్లామిక్ మత గురువు మహమ్మద్ బెలో అబుబాకర్ ఈ పరంపరను ఇకముందు కూడా కొనసాగిస్తానని చెబుతున్నాడు. 92ఏళ్ల బెలో అబుబూకర్ చనిపోయాడన్న వదంతుల నేపథ్యంలో.. మీడియా ముందుకు వచ్చి తాను బ్రతికే ఉన్నానని చెప్పిన ఆయన.. ఎవరెంత వాదించినా పెళ్లిళ్ల విషయంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు.

నైజీరియాలోని బిడా రాష్ట్రానికి చెందిన బెలో అబుబాకర్.. ఇప్పటిదాకా 107మందిని వివాహం చేసుకున్నాడు. ఇందులో 10మందికి విడాకులివ్వడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 97కు తగ్గింది. నైజీరియన్ స్థానిక ఇస్లామిక్ రూల్స్ ప్రకారం అక్కడి ముస్లిం వ్యక్తులకు నలుగురు భార్యలను చేసేందుకు అనుమతి ఉంది. అయితే వారందరినీ సమాన పోషణ అందించే బాధ్యత కూడా వారిపై ఉంటుంది.

92-year-old Nigerian cleric with 97 wives says he will marry more

అయితే బెలో అబుబాకర్ మాత్రం దైవ ప్రయోజనాల కోసమే తాను ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నాని చెబుతున్నాడు. ఇది ఆ దేవుడు తనకు ఇచ్చిన అసైన్ మెంట్ లాంటిదని జీవితం చివరి వరకు కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొస్తున్నాడు.'ఆ దేవుడే నన్నిలా ఎక్కవ పెళ్లిళ్లు చేసుకోమన్నాడు' అంటూ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా 2008లో తొలిసారిగా బెలో పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది.

కాగా, బెలో చేసిన ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ.. అక్కడి ఇస్లాం కమ్యూనిటీలో నిరసన గళాలు వినిపించాయి. స్థానిక ఇస్లామిక్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న బెలోను అరెస్టు చేయాల్సిందిగా అక్కడి షరియా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రజల్లో ఆందోళనలు రెచ్చగొట్టడానికి ప్రేరేపిస్తున్నారన్న అభియోగం కింద అతన్ని అరెస్టు చేశారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు.. తనకున్న 86మంది భార్యల్లో 82మందికి విడాకులు ఇవ్వాలన్న షరతుతో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే బెలో మాత్రం ఆ షరతులను లెక్కచేయకపోగా, తన భార్యల సంఖ్యను 97కు పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూల పరంపర కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ' నాకు ఎక్కువ మంది భార్యలా! నాకు కేవలం 97మంది భార్యలు మాత్రమే ఉన్నారు. నేనింకా చాలామందిని పెళ్లి చేసుకోబోతున్నాను. నేను బ్రతికున్నంత వరకు ఈ పెళ్లిళ్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. నాకు ఇవే అవకాశాలు మిగిలున్నాయి, నేనింకా ఇద్దరినీ మాత్రమే పెళ్లి చేసుకుంటానేమో! ఇదంతా ఆ దేవుడి ప్రయోజనం కోసమే. నా పెళ్లిళ్లపై, భార్యల సంఖ్యలపై గగ్గోలు పెడుతున్నవారంతా ఆ దేవుడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లే' అంటూ వెల్లడించాడు. మొత్తానికి బ్రతికున్నంతవరకు తన పెళ్లిళ్ల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టేలా లేడు బెలో.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+