రూ.160 కే అద్భుతమైన ఆరు బెడ్రూంల ఇల్లు... మీరు కొంటారా?

బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తి కేవలం 160 రూపాయలకే బ్రిటన్ లో అద్భుతమైన ఆరు బెడ్రూంల హౌస్ ను సొంతం చేసుకోండంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

లండన్: బ్రిటన్ లో ఓ వ్యక్తి కేవలం 160 రూపాయలకే అద్భుతమైన తన ఆరు బెడ్రూంల హౌస్ ను సొంతం చేసుకోండంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్ లోని మెల్లింగ్ నగరంలో ఉన్న లాంక్ షైర్ కు చెందిన డన్‌ స్టన్‌ లో (37) 2011లో 4,35,000 పౌండ్లు (3.50 కోట్ల రూపాయలు) ఖర్చు చేసి ఆరు పడకలతో ఉన్న పెద్ద భవంతిని కొనుగోలు చేశాడు.

తరువాత తన అభిరుచికి తగినట్టు దానిని పునరుద్ధరించాడు. ఇందుకు చాలా ఖర్చయింది. ఈ మొత్తాన్ని రుణంగా తీసుకున్నాడు. అయితే ఆ రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆ భవంతిని అమ్మేయాలని నిర్ణయించుకుని, 8.45 లక్షల పౌండ్లుగా ధర నిర్ణయించి అమ్మకానికి ఉంచాడు.

అయితే ఆ ధరకు దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గత ఏడాది డిసెంబర్ లో ఆ ఇంటి ధరను మరికొంత తగ్గించి 8 లక్షల పౌండ్లుగా ప్రకటించాడు. అయినా ఎవరూ ఆయనను సంప్రదించలేదు. దీంతో మళ్లీ తగ్గించి, 6.50 లక్షల పౌండ్లు (5.25 కోట్ల రూపాయలు) గా నిర్ణయించి అమ్మకానికి పెట్టాడు.

A £2 raffle ticket could win you this mansion in Lancashire

ఈ ధరకు కూడా సదరు భవంతిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో డన్‌ స్టన్‌ లో తన భార్యతో చర్చించి...తన అందమైన భవంతిని లాటరీ పద్ధతిలో అమ్మాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కేవలం 2 పౌండ్ల (160 రూపాయల) కే ఆ ఇంటిని సొంతం చేసుకోవచ్చంటూ 'విన్ ఎ కంట్రీ హౌస్ డాట్ కాం' వెబ్ సైట్ ద్వారా ప్రకటన చేశాడు. కొనుగోలుదారులు చేయాల్సిందల్లా ఆన్‌ లైన్‌ ద్వారా కానీ, ఆఫ్‌ లైన్‌ ద్వారా కానీ టికెట్ కొనుగోలు చేయడమే.

1 ఆగస్టు 2017న లాటరీ తీసి విజేతను ప్రకటిస్తామని తెలిపాడు. గడువు లోపు 5 లక్షల టికెట్లు అమ్మాలని డన్‌ స్టన్‌ లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 1.20 లక్షల ( వీటి విలువ 96 లక్షల రూపాయలు) లాటరీ టిక్కెట్లను విక్రయించారు. విశేషం ఏమిటంటే, ఈ భవంతిని కొనుగోలు చేసేందుకు కేవలం బ్రిటన్‌ నుంచే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి కూడా ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారట. చూద్దాం మరి.. అద్భుతమైన ఆ భవంతి ఎవరి సొంతమవుతుందో!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+