Viral Video: కదులుతున్న కారులోంచి బయటపడ్డ చిన్నారి.. వీడియో వైరల్..
చైనాలో ఓ చిన్నారి కారు కిటికీలోంచి రోడ్డు పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, షాంఘైకి దక్షిణంగా తూర్పు చైనాలోని నింగ్బో నగరంలో ట్రాఫిక్ కూడలిలో ఈ సంఘటన జరిగింది. కారు కదులుతున్న క్రమంలో వెనుక సీటు నుంచి కిటికీలోంచి బయటకు వంగి ఉన్న బాలిక ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.

రెడ్ సిగ్నల్..
ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించామని, ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని SCMP తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్రాఫిక్ జంక్షన్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో లైన్‌లో కార్లు వేచి ఉన్నాయి. తెల్లటి కారులో ఓ తిన్నాపి కిటికీలోంచి తన తల బయటకు తీస్తుంది.

వెనకాలే వస్తున్న వాహనదారులు..
అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడడంతో డ్రైవర్ కారును ముందుకు కదిలించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి కిటికీలోంచిజీబ్రా క్రాసింగ్‌పై పడింది. అయితే డ్రైవర్ గమనించకుండా తీసుకెళ్లాడు. వెనకాలే వచ్చిన కొంతమంది వాహనదారులు అమ్మాయిని సురక్షితంగా రక్షించారు. అప్పటికే భయపడిన చిన్నారి ఏడుస్తూ కనిపించింది.
బస్సు కింద పడి..
ఆ పాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత నెలలో, బ్రెజిల్‌లోని ఒక వ్యక్తి కదులుతున్న బస్సు కింద పడ్డాడు. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.












Click it and Unblock the Notifications