Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారెన్ బఫెట్‌తో లంచ్: రూ.15 కోట్లు చెల్లించిన చైనా కంపెనీ..!

న్యూఢిల్లీ: వారెన్ బఫెట్ ప్రపంచంలో ఈ పేరు వినని వారుండరంటే నమ్మండి. ప్రపంచ కుబేరుడిగా వారెన్ బఫెట్‌కు పేరు. ఈయనతో లంచ్ చేసేందుకు గాను చైనాకి చెందిన ఓ కంపెనీ దాదాపు రూ. 15 కోట్లు (2,35 మిలియన్ డాలర్లు) చెల్లించేందుకు సిద్ధమైంది.

పేదలు, ఇళ్లు లేని వారి కోసం ఆహారం, వసతి వైద్య చికిత్సల సేవలందించేందుకు గాను శాన్‌ఫ్రాన్సిస్కోలోని టెండీర్లాన్ జిల్లాకు చెందిన గ్త్లెడ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏటా ఈ ఛారిటీ విందు ఏర్పాటు చేస్తుంది.

A Chinese businessman is paying $2.35 million to eat lunch with Warren Buffett

గత 16 ఏళ్లుగా గ్త్లెడ్‌ ఫౌండేషన్‌ ఈ వేలంను నిర్వహిస్తోంది. ఈబేలో శుక్రవారంతో ముగిసిన ఐదు రోజుల వేలంపాటలో 76 బిడ్లు దాఖలవగా బీజింగ్‌కు చెందిన డాలియన్ జ్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ కో అనే సంస్థ ఝు యె అత్యధిక మొత్తం చెల్లించి ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్‌తో కలిసి ప్రైవేట్‌ లంచ్‌ చేసే అవకాశాన్ని పొందినట్లు గ్త్లెడ్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

మాన్‌హాట్టన్‌లోని స్మిత్ అండ్ వాలెన్‌స్కీ స్టీక్ హౌస్‌లో ఇచ్చే విందులో పాల్గొనడానికి వేలంపాట విన్నర్ తనతో పాటు ఏడుగురిని తీసుకెళ్లొచ్చు. ఈ విందులో 84 ఏళ్ల వారెన్ బఫెట్ తన షేర్ల గురించి మాత్రం మాడ్లాడరని సమాచారం.

గతంలో వారెన్ బఫెట్‌తో కలిసి విందు చేసిన విజేతలు ఆయన కంపెనీ బర్క్‌షైర్ హాత్‌వే గురించి మాట్లాడిన ఆయన పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. 2012లో జరిగిన వేలం పాటలో గ్త్లెడ్‌ ఫౌండేషన్‌ 3.45 మిలియన్ డాలర్లను గెలుపొందింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+