వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ చరిత్రలో తొలిసారి: ఈసారి వేడుకల్లో విదేశీ సైన్యం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి జరగనున్న పరేడ్‌లో మొట్టమొదటిసారి ఓ విదేశీ సైన్యం వేడుకల్లో పాల్గొననుంది. అంతేకాదు కవాతులో పాల్గొనే త్రివిధ దళాల బృందాలను తగ్గించడంతో పాటు పరేడ్ నిడివిని కూడా భారీగా తగ్గించారు.

దేశ చరిత్రలో ఓ విదేశీ సైన్యం, భారత సైన్యంతో కలిసి పరేడ్ పాల్గొనవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జరిగే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారు. దీంతో భారత్ కొత్త ప్రదాయానికి తెరతీసింది.

A Foreign Contingent Will March With Indian Troops This Republic Day

ఎర్రకోట పరేడ్‌లో ఫ్రెంచ్ సైనిక దళం భారత సైన్యంతో కలిసి పాల్గొననుంది. ఇందు కోసం ఫ్రెంచ్ సైన్యం ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. 14 జూలై, 1789న బాసిల్స్ కోట ధ్వంసాన్ని పురస్కరించుకుని(ఫ్రెంచ్ విప్లవానికి నాంది) 2009లో ఫ్రాన్స్‌లో జరిగిన వేడుకల్లో భారత్ అతి పురాతన రెజిమెంట్ మరాఠా లైట్ దళం పాల్గొంది.

పారిస్‌లోని ప్రాఖ్యాత చాంప్స్ ఎల్సీ వద్ద ఫ్రెంచ్ సైన్యంతో కలిసి భారత్ దళం పరేడ్ చేసింది. ఆ వేడుకల్లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కాగా భారత రిపబ్లిక్ పరేడ్‌లో ఫ్రెంచ్ ప్రతినిధి పాల్గొనడం ఇది ఐదోసారి. ప్రపంచంలో ఏ దేశ ప్రతినిధి కూడా ఇన్నిసార్లు పాల్గొనలేదు. రక్షణ, శక్తి, అంతరిక్షం, వాణిజ్యం వంటి రంగాల్లో భారత్-ఫ్రాన్స్‌లు బలమైన సంబంధాలను కలిగిఉన్నాయి.

English summary
This Republic Day, a foreign army contingent will march shoulder to shoulder with the Indian army down the Rajpath - a first in the history of the parade since 1950. Receiving their salute will be French President Francois Hollande - the chief guest this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X