వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక చాలు: అమెరికాలో సంచలనం.. గన్ కల్చర్‌పై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసన!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: గన్ కల్చర్‌పై అమెరికాలో తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా బుధవారం ఆ దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థులు తమ నిరసన గళాన్ని వినిపించారు. విద్యార్థుల ఆందోళనకు ఉపాధ్యాయులు కూడా మద్దతు పలికారు.

ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్ స్కూల్లో ఇటీవల జరిగిన కాల్పుల్లో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మృతుల జ్ఞాపకార్థం దేశ వ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థులు బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా పాఠశాలల్లోంచి భారీగా బయటికి వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

A generation raised on gun violence sends a loud message to adults: Enough

ఈ సందర్భంగా విద్యార్థులంతా గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్న గన్‌కల్చర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరింత మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు బయటికి పోకుండా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. అయితే కేవలం అతి తక్కువ స్కూల్స్ మాత్రమే ఇలా విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు రాకుండా నిలువరించగలిగాయి. ఏదిఏమైనా అమెరికాలో ఇదొక అనూహ్య చర్యగా చెప్పుకుంటున్నారు.

English summary
Thousands of students across the United States walked out of class Wednesday to demand stricter gun laws in a historic show of political solidarity that was part tribute and part protest. From Maine to California, the 17-minute walkout -- one minute for each of the 17 people killed at Florida's Marjory Stoneman Douglas High School one month ago -- began around 10 a.m. in each time zone. Some participants read the names of each victim; others stood in silence around sets of empty chairs. At Granada Hills Charter High School in Los Angeles, students lay down on a football field to spell out the walkout's rallying cry: "Enough."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X