ఒక పక్క ఉద్యోగాలు తీసేస్తుంటే.. ఈ అమ్మాయి రూ.3.40 కోట్ల ఉద్యోగాన్ని కాలదన్నింది
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ఒక పక్క ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని స్థితిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ఐటీ ఉద్యోగులు. టెక్ దిగ్గజ కంపెనీలన్నీ కూడా లేఆఫ్స్ బారిన పడ్డాయి. గూగుల్, టీసీఎస్, మెటా, యాక్సెంచర్ వంటి సంస్థలు తమ ఎంప్లాయిస్ కు షాకుల మీద షాకులు ఇస్తోన్నాయి. ఈ పరిస్థితుల్లో గూగుల్ లో పని చేసే ఓ ప్రోగ్రామ్ మేనేజర్ ఏకంగా 3.40 కోట్ల రూపాయల ఉద్యోగాన్ని వదులుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె పేరు ఫ్లోరెన్స్ పొయిరెల్. వయస్సు 37 సంవత్సరాలు. జూరిచ్ గూగుల్ లో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్. జీతం.. సంవత్సరానికి 3,90,000 డాలర్లు అంటే మన కరెన్సీలో 3.40 కోట్ల రూపాయలు. 12 సంవత్సరాలకు పైగా ఆమె గూగూల్ లో వేర్వేరు హోదాల్లో పని చేశారు. కొద్దిరోజుల కిందటే ఈ ఉద్యోగాన్ని వదులుకున్నారు. దీనికి పెద్దగా కారణాన్ని వెదుక్కోలేదామె. కుటుంబంతో గడపడానికే ఉద్యోగానికి రాజీనామా చేశారు.

జాబ్ వదిలేసే సమయానికి బర్న్‌అవుట్‌లో లేనని, రోజులాగే ఆఫీస్ కు వచ్చి.. జాబ్ ను వదిలేశానని వెల్లడించారు. CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పొయిరెల్ భర్త జాన్ కూడా గూగుల్ ఉద్యోగే. ఇద్దరం ఎక్కువ సమయంలో ఆఫీస్ లో గడపాల్సి వస్తోందని, అదే ప్రపంచంగా మారిందనే అభిప్రాయానికి వచ్చామని, తమకు తెలియకుండానే ఇంతకాలం ఆఫీస్ అనే నాలుగు గోడల మధ్యే జీవించామని పేర్కొన్నారు.
ఇద్దరిలో ఎవరో ఒకరు జాబ్ ను వదులుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాతే.. తానే చొరవ తీసుకున్నానని వివరించారు. ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకొన్నానని అన్నారు. ఇప్పుడా నిర్ణయం తీసుకోకపోతే.. రిటైర్మెంట్ అయ్యేంత వరకూ కుటుంబంతో గడిపే అవకాశం దక్కేది కాదని చెప్పారు. ఓ సగటు జీవిత భాగస్వామిగా భర్తతో గడపడానికి పదవీ విరమణ వరకు వేచి ఉండటం తన వల్ల కాలేదని వ్యాఖ్యానించారు. అని ఆమె వెల్లడించారు.
ఈ ఏడాది జనవరి నాటికి పొయిరెల్ సుమారు 12.6 కోట్ల రూపాయలను సంపాదించారు.. ఉద్యోగం ద్వారా. ఈ మొత్తం మిగిలిన జీవితాన్ని సుఖంగా గడపడానికి సరిపోతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత జాన్ కూడా జాబ్ మానేస్తాడని, కనీసం ఏడాదిన్నర పాటు వివిధ దేశాలను చుట్టి రావాలనేది తమ ప్లాన్ అని వివరించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications