థియేటర్‌లో సినిమా చూస్తుంటే కాల్చిపారేశాడు
లూసియానా: అందరూ హాయిగా సినిమా చూస్తున్న సమయంలో దుండగుడు (58) రెచ్చిపోయి కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. తరువాత దుండగుడు తనను తాను కాల్పుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లూసియానాలో జరిగింది.
లూసియానా లోని లాఫాయెట్ నగరంలో గ్రాండ్ థియేటర్ ఉంది. బుధవారం రాత్రి సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల తరువాత ఒక దుండగుడు తుపాకి తీసుకుని విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. తరువాత తనను తాను కాల్పుకున్నాడు.

ఈ దాడిలో దుండగుడితో పాటు ముగ్గురు మరణించారు. 7 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామని ఆపరేషన్స్ ఫర్ అకాడియన్ అంబులెన్స్ ఉపాధ్యక్షుడు క్లే హెన్రీ తెలిపారు. అయితే కాల్పులు ఎందుకు జరిపాడనేది తెలియడం లేదని పోలీసులు అన్నారు.
సినిమా హాల్ లో జరిగిన కాల్పులలో గాయాలైన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు. సినిమా చూస్తున్న వారు మందు గుండు పేలి ఉంటుందని మొదట భావించారని స్థానిక మీడియా వెల్లడించింది. లూసియానా గవర్నర్ బాబి జిందాల్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications