USA: అమెరికాలోని రక్షణ కార్యలయం వద్ధ భారీ పేలుడు.. తోసిపుచ్చిన పెంటగాన్..

సోమవారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ పేలుడు సంభవించనట్లు వార్తలు వచ్చాయి. పేలుడు జరిగినట్లు వస్తున్న వార్తలను పెంటగాన్ తోసిపుచ్చింది. జీ న్యూస్ టీవీ ఛానెల్ వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక వార్తా అంశం ప్రకారం, "అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ పేలుడు వార్త తెరపైకి వస్తోంది" అని వార్త కథనాన్ని ప్రచురించింది. అయితే, అమెరికా రక్షణ శాఖ సమీపంలో పెంటగాన్ కాంప్లెక్స్ చిత్రాన్ని చూపిస్తూ అలాంటి పేలుడు జరగలేదని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ ఖండించారు.

ఇంతలో, పెంటగాన్ అధికార ప్రతినిధి అటువంటి పేలుడు సంభవించ లేదని ఖండించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పేలుడు చిత్రాలను రూపొందించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ చిత్రాలు చాలా సహజంగా కనిపించాయి, ఇది సోషల్ మీడియాలో USలోని ప్రజలలో భయాందోళనలకు దారితీసింది.

 huge explosion

అయితే అమెరికాలో మాత్రం గన్ కల్చర్ పెరుగుతోంది. జనవరి 4న ఎనోచ్‌లో అనే ఓ వ్యక్తి తన భార్యను, ఐదుగురు పిల్లలను, అతని అత్తగారిని తుపాకీతో కాల్చి చంపాడు. జనవరి 16న సెంట్రల్ కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. జనవరి 21న హుయు కెన్ ట్రాన్ మానిటరీ పార్క్‌లోని స్టార్ బాల్‌రూమ్ డ్యాన్స్ స్టూడియోలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలో జరిగిన కాల్పుల్లో 11 మందిని చనిపోయారు.

జనవరి 23న హాఫ్ మూన్ బేలో అనేక మైళ్ల దూరంలో ఉన్న ఒక పొలంలో ఓ వ్యక్తి ముగ్గురిని కాల్చి చంపాడు. మార్చి 27న నాష్‌విల్లేలోని ఒక ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్‌లో మాజీ విద్యార్థి జరిగిన కాల్పుల్లో ఆరుగు చనిపోయారు. ఏప్రిల్ 10న కెంటుకీలోని లూయిస్‌విల్లేలోని ఒక బ్యాంకులో కానర్ స్టర్జన్ కాల్పులు జరిపాడు. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు చనిపోయాడు. ఏప్రిల్ 28న గ్రామీణ క్లీవ్‌ల్యాండ్ పట్టణంలో ఐదుగురిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+