‘ఓ భర్త! భార్యను ప్రేమించడానికి 15కారణాలు ఇవే’
లాస్ఏంజెలిస్: తన భార్యను ప్రేమించడానికి గల కారణాలు వివరిస్తూ ఓ భర్త చేసిన ప్రయత్నం అతని భార్యనే గాక ప్రపంచంలోని చాలామంది దంపతులను ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు అతను చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. తన భార్యనే చూస్తుందో? చూడదో? అని భావించిన ఆ భర్తకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వస్తుండటంతో అతడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అంతేగాక, అతని భార్య అతను చేసిన ప్రయత్నంతో తానెప్పుడూ తన భర్తను ప్రేమిస్తూనే ఉంటానని కన్నీటి పర్యాంతమైంది కూడా.
వివరాల్లోకి వెళితే.. లాస్ఏంజిల్స్ నగరంలో ఇంజనీరుగా పనిచేస్తున్న టిమ్ మర్ఫీ తన భార్య పట్ల తనకున్న ప్రేమానురాగాలను వ్యక్తం చేయడానికి 15 కారణాలు వెతుక్కున్నారు. వాటిని తమ బెడ్‌రూమ్‌లోని అద్దంపై రాసి మానసిక సంక్షోభంలో కొట్టుకుపోతున్న భార్యను రక్షించుకున్నారు. అతడు చెప్పిన కారణాలు హత్తుకునేలా ఉండటంతో ఒక్కసారిగా ఆన్‌లైన్ హీరోగా మారిపోయారు.

భార్యను ప్రేమించడానికి టిమ్ వ్యక్తం చేసిన కారణాలు:
1. ఆమె నాకు మంచి స్నేహితురాలు
2. ఆమెగానీ, నేనుగానీ ఎప్పటికీ విడిపోము
3. నా క్రేజీ ప్రాజెక్టులపై పనిచేసుకోవడానికి ఆమె నాకు కావల్సినంత సమయం ఇస్తోంది
4. ప్రతిరోజు ఆమె నన్ను నవ్విస్తుంది
5. ఆమె చాలా అందమైనది
6. నేనెంత క్రేజీ పర్సన్ అయినప్పటికీ ఆమె సహిస్తోంది
7. నాకు తెలిసిన వాళ్లలో ఆమె దయగల వ్యక్తి
8. ఆమె గొంతు ఎంతో రమ్యంగా ఉంటుంది
9. ఆమె నాతో స్ట్రిప్ క్లబ్‌కు కూడా వచ్చింది
10. ఆమె అంతులేని విషాదాన్ని అనుభవించింది. అయినా మానవత్వం పట్ల ఆమెకున్న ఆశాభావం అపారం
11. కెరీర్‌లో నాకు వచ్చిన అన్ని అవకాశాలకు అండగా నిలబడింది. ప్రతిసారి నా వెన్నంటే నడిచింది
12. నేను ఎప్పుడూ ఎవరికి చేయని సేవ, ఆమెకు చేసేలా చేసింది
13. ఆమె కెరీర్ దూసుకెళుతూ అద్భుతమైన జాబ్ చేస్తోంది
14. చిన్న జంతువులు కూడా ఆమెను ఏడిపించేవి
15. ఆమె పగలబడి నవ్వినప్పుడు ఉద్వేగం వచ్చేది
'ఇవి నేను నా భార్య మొల్లీ మర్ఫీని ప్రేమించడానికి కారణాలు' అన్న శీర్షిక కింద బెడ్ రూమ్ అద్దంపై టిమ్ మర్ఫీ రాసిన పంక్తులను ఆయన భార్య చూసి చలించిపోయింది. కన్నీళ్ల పర్యంతమైంది. అంతేగాక, శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే ముందు భర్తతో గొడవ పడినందుకు బాధ పడింది. ఆనందం లాంటి విషాధంలో ధారాపాతంగా కన్నీళ్లు కార్చింది.
తేలికైన హృదయంతో లేచి అద్దంపై భర్త రాసిన వ్యాక్యాలను సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి 'ఇమ్గూర్' అనే సోషల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దాన్ని మూడు రోజుల్లోనే దాదాపు ఆరులక్షల మందికిపైగా వీక్షించారు. వాస్తవానికి తన భార్యను ఉద్దేశించే తానీ వ్యాక్యాలు రాశానని, కనీసం ఆమైనా
చూస్తుందన్న నమ్మకం తనకు లేకుండేనని, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చూశారని, ఇది ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతకన్నా ఆశ్చర్యం తన భార్య తనను ఉదయాన్నే నిద్రలేపి పలకరిస్తోందని టిమ్ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. ఇది వరకు తాను తెలియని మానసిక క్షోభతో అస్తమానం భర్తతో గొడవ పడేదాన్నని, బాత్‌రూమ్‌లోకి వెళ్లి గంటల తరబడి గడియవేసుకొని అలా ఉండిపోయేదాన్నని మొల్లీ తన గురించి వెల్లడించింది.
తాను ఇప్పటికీ మానసికంగా పూర్తిగా కోలుకోలేదని, తన భర్త తనకు అండగా ఉండగా, తప్పనిసరిగా కోలుకుంటానన్న పూర్తి విశ్వాసం తనకుందని ఆమె చెప్పారు. తాను ప్రతిరోజు లేవగానే అద్దంపై టిమ్ రాసిన వ్యాక్యాలను చదువుతానని, తాను ఇంకేమాత్రం ఒంటరిదాన్ని కాదన్న తృప్తి కలుగుతోందని, నాకు మంచి స్నేహితుడు, కో పైలట్ ఉన్నాడని తాజా పోస్ట్‌లో మొల్లీ పేర్కొంది.












Click it and Unblock the Notifications