వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాక్షసుడు: ఈ ఐఎస్ ఉగ్రవాది కన్న తల్లినీ వదల్లేదు

|
Google Oneindia TeluguNews

రఖ్కా: ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల క్రూరత్వానికి పరాకాష్ఠగా పలు ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా ఓ ఉగ్రవాది కన్నతల్లినే తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన సిరియాలోని రఖ్కా ప్రాంతంలో చోటు చేసుకుంది.

సిరియన్‌ అబ్జర్వేటరీ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి.. సిరియాలోని రఖ్కాలో ఉండే అలీ సకర్‌ అల్‌ ఖాసిమ్‌(20) అనే ఉగ్రవాది తల్లి లెనా (45).

ఇస్లామిక్‌ స్టేట్‌లో పనిచెయ్యడం మానేయమని ఆమె కొడుక్కి చెప్పింది. రఖ్కా నుంచి పారిపోయి వేరే చోట బతుకుదామని ఆమె తన కుమారుడిని కోరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఖాసిమ్.. ప్రజలు ఎక్కువగా ఉన్న ఓ ప్రాంతానికి తల్లిని బలవంతంగా తీసుకెళ్లాడు.

ఆ తర్వాత అక్కడే అందరూ చూస్తుండగానే... ఆమె తలకు తుపాకీ గురి పెట్టి కాల్చి చంపేశాడు. ఈ ఘటన చూస్తే ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరిన వారు ఎంత క్రూరంగా మారిపోతున్నారో అర్థమవుతోంది. కన్న తల్లి అని కూడా చూడకుండా దారుణంగా చంపేశాడు ఈ ఉగ్రవాది.

English summary
In a shocking low even by the standards of the so-called Islamic State, a militant has publicly executed his own mother after accusing her of apostasy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X