భార్య డబ్బులతో ప్రియురాళ్లతో రాసలీలు: పడకగదిలో పట్టేసిందిలా..
కట్టుకున్న భార్య సంపాదనతో తన ప్రియురాళ్లతో ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో వారున్న పడకగదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది అతడి భార్య.
కువైట్: కట్టుకున్న భార్య సంపాదనతో తన ప్రియురాళ్లతో ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో వారున్న పడకగదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది అతడి భార్య. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అతపై నమోదు చేశారు. ఈ ఘటన కువైట్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కువైట్ నగరంలోని ఓ ఇంట్లో సదరు వ్యక్తితోపాటు అతని భార్య ఉంటున్నారు. అయితే, పెళ్లికి ముందునుంచే ఆమె భర్త మరో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపిపిస్తున్నాడు. అంతేగాక, వారితో శారీరక సంబంధాలను కూడా ఏర్పరచుకున్నాడు.

అంతటితో ఆగని ఆ ప్రబుద్ధుడు.. కైరాన్ ప్రాంతంలో సొంతంగా ఓ ఫ్లాట్ కొందామని నమ్మించి భార్య నుంచి 20వేల కువైట్ దీనార్లు(సుమారు రూ.45లక్షలు) తీసుకున్నాడు.
ఈ డబ్బుతో న్యూగ్రా ప్రాంతంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని తన ప్రియురాళ్లతో రాసలీలు కొనసాగిస్తున్నాడు.
కాగా, ఎన్నిసార్లు అడిగినా కొత్త ఫ్లాట్ వద్దకు తీసుకెళ్లకపోవడం, రిపేర్లు చేయిస్తున్నానంటూ సాకులు చెప్పుకొస్తుండటంతో భార్యకు అనుమానం వచ్చింది. ఓ రోజు ఇంటి నుంచి బయల్దేరిన భర్తను అతనికి తెలియకుండా వెంబడించింది. కైరాన్ ప్రాంతం అని చెప్పి న్యూగ్రాకు వెళ్లుండటంతో ఆమె అనుమానం మరింత బలపడింది.
Recommended Video

ఊరి చివరన ఓ ఎస్టేట్‌లో ఫ్లాట్ ముందు భర్త కారు ఆపి లోపలికి వెళ్లడాన్ని చూసింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఫ్లాట్ వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది. దీంతో ఫ్లాట్ లోని ఓ యువతి వచ్చి తలుపు తీసింది. వెంటనే గదిలోకి దూసుకెళ్లి.. భర్తను పడకపై చూసింది. ఆగ్రహం పట్టలేక వెంటనే బయటికి వచ్చి తలుపులను మూసేసి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications