విచిత్రం: గొర్రెల మందకు కాపలాగ సింహం(వీడియో)
మాస్కో: సింహం అంటే ఏ జంతువుకైనా హడలే. ఎందుకంటే అది అడవికి రారాజు. బలశాలి అయిన సింహం ముందు ఏ జంతువైనా మొకరిల్లాల్సిందే. రష్యాలోని ఓ ప్రాంతంలో మాత్రం ఓ సింహం.. గొర్రెల మందకు కాపాల కాస్తోంది. గొర్రెలకు ఎలాంటి ఆపదా రాకుండా ఆ మంద చుట్టూ తిరుగుతూ రక్షణ కవచంలా ఉంటోంది.
ఈ వింత వివరాల్లోకి వెళితే.. రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ డగెస్థాన్‌కి చెందిన బెరంబెక్ రహిమొవ్‌కు కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాటిని రోజూ మేత కోసం అడవికి తీసుకెళతాడు. వాటితో పాటు.. ఓ సింహం కూడా అతని వెంట వెళుతుంది.
సాధారణంగా గొర్రెలు కనిపిస్తేనే వాటిపై దాడి చేసే సింహం.. అతగాడి గొర్రెలకు నిరంతరం కాపలా ఉంటోంది. గొర్రెలవైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా రక్షణ కల్పిస్తోంది.
సింహం గురించిన అసలు విషయానికొస్తే.. బెరంబెక్‌కు అతని స్నేహితుడు ఈ సింహం ఆరు నెలల పసికూనగా ఉన్నప్పుడు బహుమతిగా ఇచ్చాడట. దీంతో సింహానికి 'మాష' అని పేరు పెట్టి తనకున్న గొర్రెల మందలో కలిపేసి పెంచడం ప్రారంభించాడు. దీంతో అది కూడా తాను సింహం అని, అడవికి రారాజు అనే సంగతి తెలియకుండా పెరిగింది.
ఈ విధంగా 'మాష' గొర్రెలతోనే పెరిగి పెద్దదైంది. గొర్రెలతో పెరిగినా సింహం సింహమే కదా. అందుకే 'మాష' పెద్దదయ్యాక అదే గొర్రెల మందను రక్షించే బాధ్యతను అప్పగించాడు బెరంబెక్. దీంతో సింహాన్ని దాటి పారిపోయే పరిస్థితి గొర్రెలకు లేకుండా పోయింది. అంతేగాక, ఆ గొర్రెల మంద వైపు ఏ జంతువైనా, ఏ దొంగైనా చూసే ధైర్యం కూడా లేకుండా పోయింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications