చైల్డ్ పోర్న్ వీడియో తీశారు: 235 ఏళ్ల జైలు శిక్ష

న్యూయార్క్: చైల్డ్ పోర్న్ కు పాల్పడుతున్న వ్యక్తికి, అతనికి సహకరించిన మహిళకు అమెరికాలోని కోర్టు 235 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇద్దరు పిల్లలతో బలవంతంగా లైంగిక వీడియో రూపొందిస్తూ పట్టుబడటంతో కోర్టు కఠినంగా శిక్షించింది.

అమెరికాలోని లివర్ పూల్ లో జాసన్ కాప్ (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను అలెన్ బాండ్ అనే మహిళ సహాయంతో చైల్డ్ పోర్న్ వీడియోలు తీస్తున్నాడు. కొంత కాలంగా చిన్నపిల్లలను ఎగుమతి చేస్తున్నాడు.

వారితో బలవంతంగా పోర్న్ వీడియోలు స్వయంగా తియ్యడం, వారి ఫోటోలు తీసి విక్రయించడం లాంటి పనులు చేస్తున్నాడు. ఓ సారి పక్కా సమాచారం అందుకున్న చైల్డ్ ఎక్స్ ప్లాయిటేషన్ టాస్క్ ఫోర్స్ బృందం మొదట జాసన్ కాప్ తో ఎస్ఎంఎస్ ల ద్వారా సంబంధం పెట్టుకుంది.

A Liverpool man was sentenced to 235 years in prison in US

చివరికి జాసన్ కాప్ దగ్గరే పూర్తి వివరాలు సేకరించారు. కచ్చితమైన సమాచారం సేకరించిన తరువాత జాసన్ కాప్ ఇంటికి వెళ్లారు. తాము అండర్ కవర్ పోలీసులు అని చెప్పడంతో జాసన్ కాప్ షాక్ తిన్నాడు.

తన దగ్గర ఓ చిన్నారి ఉందని, ఎమిలీ ఒబరస్ట్ అనే మహిళ ఆ పాపను తన దగ్గరకు తీసుకువచ్చిందని జాసన్ కాప్ పోలీసులకు చెప్పాడు. ఆ పాపను స్కూల్ కు పిలుచుకుని వెళ్లి, ఇంటికి పిలుచుకుని రావడానికి పాప కుటుంబ సభ్యులు ఎమిలీని పెట్టారని పోలీసు విచారణలో వెలుగు చూసింది.

జాసన్ కాప్, అతనికి సహకరిస్తున్న అలెన్ బాండ్ అనే మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులు ఇద్దరూ నీచమైన పని చేస్తున్నారని కోర్టు గుర్తించింది. జాసన్ కాప్ కు 235 ఏళ్లు, అతనికి సహకరించిన అలెన్ బాండ్ కు 235 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+