WWE లో సత్తా చాటిన ట్రంప్: చెడ్డపేరుతో డ్రాప్ (వీడియో)

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ (45వ అధ్యక్షుడు) ప్రముఖ వ్యాపారవేత్త అని అందరికి తెలుసు. అయితే ప్రపంచ ప్రఖ్యాతి పోందిన WWE రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో భాగంగా డోనాల్డ్ ట్రంప్ ఓ వెలుగు వెలిగిపోయారు.

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ (WWE)లో డోనాల్డ్ ట్రంప్ తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు డోమాక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను ఓడించి విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ గతంలో రెజ్లింగ్ లో అలాంటి విజయాలు సోంతం చేసుకున్నారు.

నానా హంగామా

నానా హంగామా

WWE చరిత్రలో ఒక్క పోటీని మిస్ కాకుండా హాజరైన ట్రంప్ నానా హంగామా చేశారు. రెజ్లింగ్ మేనియా పోటీల్లో తన పాత స్నేహితుడు విన్స్ మేక్ ను అందరి ముందు ఖర్చోపెట్టి అతనికి గుండు కొట్టి కసి తీర్చుకున్న చరిత్ర డోనాల్డ్ ట్రంప్ ది.

గుండు కొట్టి కసి తీర్చుకున్న ట్రంప్

మోజు కోసం రెజ్లింగ్ పోటీలకు వెలుతున్న ట్రంప్ కు విన్స్ మేక్ మంచి స్నేహితుడు. 2007 నుంచి విన్స్ తన భార్య లిండాతో కలిసి డోనాల్డ్ ట్రంప్ చారిటి ఫౌండేషన్ కు 5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చేవారు. అలాంటి విన్స్ నే అందరి ముందు బహిరంగంగా గుండు కొట్టి తన కసి తీర్చుకున్న చరిత్ర డోనాల్డ్ ట్రంప్ కు ఉంది.

గుండు కొట్టడం పెద్ద శిక్ష

బిలీయనర్ vs బిలీయనర్ వరస పోటీల్లో ఎవరు ఓడిపోతే ఆ టీం మేనేజ్ కు గుండు కొట్టడం శిక్షగా విధించారు. ఆ సమయంలో ట్రంప్ టీం ఓడిపోయి ఉంటే అప్పుడే ఆయనకు(ట్రంప్) గుండు కొట్టి ఉండేవారు. అయితే ట్రంప్ టీంలోని బాబి లాశ్లే విన్స్ టీంలోని సభ్యులను చిత్తుచిత్తుగా ఓడించారు. ఆ సమయంలో డోనాల్డ్ ట్రంప్, స్టోన్ కోల్డ్ కలిసి క్లీన్ షేవ్ తో విన్స్ కు గుండు గీచారు.

మహిళా రెజర్లు ఫిర్యాదుతో డ్రాప్

2013లో డోనాల్డ్ ట్రంప్ స్త్రీలోలుడు ( అమ్మాయిల బానిస) అని ప్రపంచానికి వెలుగు చూసింది. ఆ సమయంలో రింగ్ లో సంపాధించిన పేరు తుడిచిపెట్టుకుపోయింది. సీక్రెట్ రూంలో వచ్చిన చెడ్డ పేరు మూటకట్టుకుంది. అంతే WWEలో ట్రంప్ మీద పలు విమర్శలు వచ్చాయి. తమతో అసభ్యంగా ప్రవర్తించారని పలువురు మహిళా రెజ్లర్లు డోనాల్డ్ ట్రంప్ మీద ఫిర్యాదు చెయ్యడంతో ఆ పోటీలకు ఆయన దూరం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+