అమెరికన్ విద్యార్థులను వెంటాడుతున్న 'కాల్పుల' భయం..
వాషింగ్టన్: ఫ్లోరిడా స్కూల్ కాల్పుల ఘటన తర్వాత అమెరికాలోని చాలామంది చిన్నారులు.. ఎక్కడ తమ స్కూల్లో కాల్పులు చోటు చేసుకుంటాయో? అన్న భయాందోళనతో గడుపుతున్నారట. ప్రఖ్యాత అమెరికా పరిశోధనా సంస్థ ప్యూ (పీఈడబ్ల్యూ) సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
13 నుంచి 17ఏళ్ల వయసున్న విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సర్వేలో 57 శాతం చిన్నారులు తాము చదువుకుంటున్న స్కూల్లోనే ఇలాంటి సంఘటన జరగొచ్చని భావిస్తున్నామని చెప్పారు. అమెరికాలో మైనారిటీలైన హిస్పానిక్(లాటినోలు), నల్లజాతి పిల్లలు కాల్పుల ఘటనలపై అందరికంటే ఎక్కువగా భయపడుతున్నట్టు సర్వే తెలిపింది.

కాగా, ఫిబ్రవరి 14న పార్క్‌లాండ్‌లోని మార్జరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ కాల్పుల ఘటనలో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత తుపాకుల వాడకంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications