Flight: మీరెక్కిన విమానంలో మీరొక్కరే ఉంటే..
విమానం ఎక్కాలని దాదాపు ప్రతి ఒక్కరి కలగా ఉంటుంది. కానీ చాలా మందికి ఇది కలగానే మిగిలిపోతోంది. అయితే విమానంలో ప్రయాణిస్తే మనతో పాటు తోటి ప్రయాణికులు కూడా ఉంటారు. ప్రత్యేక విమానం అయితే మనం ఒక్కరమే ఉంటాయి. కానీ ప్యాసింజర్ విమానంలో ప్రయాణికులందరూ ఉంటారు. కానీ ఓ ప్యాసింజర్ విమానంలో ఒకే ఒక వ్యక్తి ప్రయాణం చేశాడు. అవును ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్ లో ఉన్న తన కుటుంబాన్ని చూడడానికి విమానం ఎక్కిన UK ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది.
విమానం ఎక్కిన ఆ వ్యక్తికి ఎవరు కనిపించలేదు. తానొక్కడినే ప్రయాణికుడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. 65 ఏళ్ల పాల్ విల్కిన్సన్ తన దేశం పోర్చుగల్ నుంచి ఐర్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. అయితే అతను వెళ్లేసారికి బోర్డింగ్ వద్ద ఇతర ప్రయాణికులు ఎవరు కనిపించలేదు. దీంతో తాను తొందరగా వచ్చానా లేక లేటుగా వచ్చనా అనే సందేహం కలిందన్నారు.

దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా.. సరైన సమయంలోనే వచ్చారని తెలిపారు."ఈ రోజు మీరొక్కరే ప్రయాణించబోతున్నారు. ఇది మీ వ్యక్తిగత విమానం అనుకోండి. ఈ రోజు మీరు మా వీఐపీ" చెప్పారని విల్కిన్సన్ చెప్పారు . తొలుత వారు తనతో జోక్ చేస్తున్నారనుకున్నాను. కానీ, ఆ రోజు ప్రయాణికులు ఎవరూ బెల్‌ఫాస్ట్‌కు టికెట్ బుక్ చేసుకోలేదని ఆలస్యంగా అర్థమైందన్నారు. సీట్లన్నీ ఖాళీగా ఉండటంతో కెప్టెన్‌కు చెప్పి తనకు నచ్చిన సీట్లో కూర్చున్నానని తెలిపారు. సిబ్బంది నిజంగానే నన్ను వీఐపీలా చూసుకున్నారని విల్కిన్సన్ పేర్కొన్నారు. విల్కిన్సన్ కేవలం 162 డాలర్లు అంటే రూ. 13,000లతో వీఐపీ ప్రయాణం చేశాడు.
Party of one: Man boards plane, realizes he's the only passenger on the aircraft
— Georgi⚡ (@Georgi29) April 12, 2023
Paul Wilkinson, 65, boarded a flight from Portugal to Belfast all alonehttps://t.co/LXmPQbScwB pic.twitter.com/etYsqhBiM4
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications