లైవ్‌లో ఉన్న మహిళ రిపోర్టర్‌కు ముద్దు...! వేధింపుల కేసు నమోదు..
టీవీ లైవ్ కార్యక్రమాల్లో ఎన్నో వింత వింత సంఘటనలు జరగడం చాలా సార్లు చూసే ఉంటారు. లైవ్ చర్చల్లో కొట్టుకోవడం నుండి ఎన్నో విషాధ సంఘటనలు కూడ జరిగాయి. దీనికి తోడు మీడియా రంగంలో ఉన్న మహిళ జర్నలిస్టుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు పలుసార్లు విమర్శలకు దారితీసిన సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి.
ఇలాంటీ సంఘటనే తాజాగా మరో మహిళ రిపోర్టర్‌కు ఎదురైంది. అమెరికాలో జరగుతున్న ఓ ఎక్స్‌పో సంధర్భంగా వేవ్3 టీవీ చానల్ నుండి లైవ్ కవరేజ్ చేస్తున్న సారా రివేస్ట్ అనే మహిళ రిపోర్టర్‌ను అక్కడి నుండి వెళుతున్న ఓ ప్రేక్షకుడు కెమెరా ముందు కాస్త వెకిలి చేష్టలు చేశాడు..అక్కడ నుండి ముందుకు వెళ్లి మళ్లి వెనక్కి వచ్చి ఏకంగా ముద్దు పెట్టి వెళ్లిపోయాడు. ముద్దు సీన్‌తో ఒక్కసారిగా అవాక్కయిన రిపోర్టర్ తర్వాత తేరుకుని లైవ్‌లోకి వెళ్లింది. ముద్దు సీన్‌ను ముందుగా కామేడీగా తీసుకుంది.

అయితే ముద్దు సీను ట్విట్టర్‌లో విపరీతమైన ట్రోల్ అయింది. దీంతో ముద్దుపెట్టిన వ్యక్తికి మూడు సెకన్లలో ఫేమ్ అయ్యావు అంటూ సదరు వ్యక్తిని పొగుడుతూ కామెంట్లు నిండాయి. అనంతరం రిపోర్టర్ ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేధింపుల కేసుగా నమోదు చేయించింది. తన వెకిలి చేష్టలతో ఇబ్బందులకు గురి చేశారని పేర్కోంది.
అయితే విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి రిపోర్టరుకు క్షమాపణలు తెలుపుతూ లేఖ రాశాడు. తన విధులకు అటంకం కల్గించడం తోపాటు ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు కోరాడు. అయితే ఇలాంటీ వేధింపులు గతంలో కూడ జరిగాయాని పలువురు వ్యాఖ్యానించారు. 2018 జరిగిన ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కవరేజ్‌లో కనీసం 30 మంది మహిళా జర్నలిస్టులు వేధింపులను ఎదుర్కొన్నారని చెప్పారు. కాగా ముద్దు పెట్టిన వ్యక్తి ఇండియాన రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. ముద్దు పెట్టిన వ్యక్తికి నేరం రుజువైతే జరిమానాతో పాటు కనీసం 90 రోజుల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications