Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Youtube: యూట్యూబ్ వీడియో కోసం విమానాన్నే కూల్చేసిన ఘనుడు..

ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎక్కువగా ఆర్జిస్తున్నారు. అయితే కొందరు తమకు వ్యూస్ ఎక్కువ రావాలని సహాసాలు చేస్తున్నారు. ఆ మధ్య ప్రముఖ యూట్యూబర్ పాము కాటుకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఓ యూట్యూబ్ బ్లగర్ బైక్ యాక్సిడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. విరంతా తమ ప్రాణాల మీదికు తీసుకొస్తే ఓ వ్యక్తి వ్యూస్ కోసం ఏకంగా విమానాన్నే కూల్చేశాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. 29 ఏళ్ల ట్రెవర్ జాకబ్, 2021లో కాలిఫోర్నియాలోని లాస్ పాడ్రెస్ నేషనల్ ఫారెస్ట్‌లో విమానాన్ని కూల్చివేశాడు.

ట్రెవొర్‌ జాకబ్‌ ఒలింపిక్‌ స్నోబోర్డ్‌ క్రీడాకారుడు. అతడు 2014లో రష్యాలోని సోచిలో జరిగిన వింటర్‌ ఒలింపిక్స్‌ అమెరికా తరపున స్నోబోర్డ్‌లో సెమీఫైనల్స్‌ వరకు వెళ్లాడు. ఇతనికి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. దానిలో స్కైడైవింగ్‌, ఏవియేషన్‌, స్నోబోర్డింగ్‌కు సంబంధించిన కంటెంట్‌ వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. జాకబ్ యూట్యూబ్ ఛానెల్‌కు లక్షమంది సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. 2021 నవంబర్‌ 24న తన స్నేహితుడి చితాభస్మాన్ని వెదజల్లాలి అని చెప్పి లోంపోక్‌ విమానాశ్రయం నుంచి ఓ పాత సింగిల్‌ ఇంజిన్‌ లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కొనుగోలు చేశాడు జాకబ్..

A man shot down a plane for YouTube video views in America

అతను లాస్‌ పాడ్రెస్‌ నేషనల్‌ పార్క్‌పై ఎగురుతుండగా విమానం కూలిపోయింది. జాకబ్ పారాచూట్‌ సాయంతో ఆ ప్రమాదం నుంచి ట్రెవొర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల తర్వాత, జాకబ్ విమాన ప్రమాదం గురించి నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB)కి తెలియజేశాడు. కొద్ది రోజులకు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేశాడు. విమానం ఇంజిన్‌లో సమస్యలు రావడంతో పారాచూట్‌ సాయంతో తాను బయటకు దూకాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే విమానం లాస్‌ పాడ్రెస్‌ నేషనల్‌ పార్క్‌ కూలడాన్ని అతను పూర్తిగా చిత్రీకరించాడు. విమానంలో పలు భాగాల్లో కెమెరాలు అమర్చాడు.

విమానం కూలి ప్రాంతానికి వెళ్లి ఫుటేజ్ కలెక్ట్ చేసి వీడియో చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. విమానం కూలిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేశారు. మొదట్లో తన విమానం పవర్ కోల్పోయిందని, విమాన శిథిలాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలయదని చెప్పాడు. జాకబ్ 10 డిసెంబర్ 2021న తన స్నేహితుడితో కలిసి క్రాష్ సైట్‌కి వెళ్లి, క్రాష్ అయిన విమాన భాగాలను శాంటా బార్బరా కౌంటీకి తరలించారు. అక్కడ జాకబ్ దానిని హ్యాంగర్‌లో ఉంచారు. విమానంలోని భాగాలను ధ్వంసం చేశాడు. విమానాశ్రయం చుట్టూ, ఇతర ప్రాంతాల చుట్టూ ఉన్న చెత్త డబ్బాల్లో కొన్ని భాగాలన పడేశాడు.

దర్యాప్త్ ఫెడరల్ అధికారులు ఆధారాలు సేరించారు. జాకబ్ మరోసారి ప్రశ్నించారు. చివరికి జాకబ్ జరిగింది చెప్పాడు. దీంతో FAA జాకబ్ పైలట్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
అయితే క్రాష్ అయిన విమానం వీడియో దాదాపు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జాకబ్ న్యాయస్థానంలో 15 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+