Canada: కెనడా విమానాశ్రయం నుంచి బంగారం కంటైనర్ మాయం..
కెనడా(Canada)లో భారీ చోరీ జరిగింది. అది ఎక్కడో కాదు.. ఆ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే టొరొంటో విమానాశ్రయంలో ఈ దొంగతనం జరిగింది. దొంగలు మిలియన్ డాలర్ల విలువైన్ బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులు దోచుకెళ్లారు. కెనడా జాతీయ పోలీసు దళం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. చోరీ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ ఘటన ఏప్రిల్ 17న జరిగింది. సోమవారం రోజు టొరొంటోలోని పియర్సన్ విమానాశ్రయానికి ఓ కార్గో విమానం వచ్చింది. అందులోంచి దాదాపు ఆరు అడుగులు ఉన్న ఓ కంటైనర్ ను బయటకు తీశారు. ఆ కంటైనర్ లో 20 విలియన్ కెనడియన్ డాలర్ల విలువై($14.8 మిలియన్) బంగారంతో పాటు విలువైన వస్తువులు ఉన్నాయి.
ఆ కంటైన్ ను కార్గో హోల్డింగ్ ఏరియా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో గుర్తు తెలియని దుండగులు మాయం చేశారు. అయితే ఈ కంటైనర్ ను ఎక్కడ నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడి తీసుకెళ్తున్నారో పోలీసులు వెల్లడించలేదు కానీ.. కంటైన్ మాత్రం చోరీకి గురైనట్లు తెలిపారు. ఈ చోరీ జరిగి మూడు రోజులు గడిచిపోయినా పోలీసులు ఇంత వరకు ఎవరిని అదుపులోకి తీసుకోనట్లు తెలుస్తోంది. ఈ దోపిడీలో 3,600 పౌండ్ల బంగారం ఉన్నట్లు టొరంటో సన్ గతంలో నివేదించింది. దొంగతనం వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉంటుందని వార్తాపత్రిక పేర్కొంది. ప్రస్తుత ధరల ప్రకారం, 3,600 పౌండ్ల బంగారం విలువ $100 మిలియన్ కంటే ఎక్కువగా ఉంది.

కంటైనర్‌లో బంగారం మాత్రమే కాకుండా ఇతర అధిక-విలువైన వస్తువులు ఉన్నాయని విమానాశ్రయం ఉన్న పీల్‌లోని పోలీసు దళం ప్రతినిధి తెలిపారు. ఈ చోరీకి సంబంధించి విచారణ కొనసాగుతోందని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే టొరొంటోలోని పియర్సన్ ఎయిర్ పోర్టులో దొంగతనం జరగడం ఇదే మొదటి సారి కాదు. 1952లో టొరంటో ఎయిర్‌పోర్టులో 2.15 లక్షల డాలర్లు విలువైన బంగారాన్ని చోరీ చేశారు.
ఈ దొంగతానానికి సంబంధించి నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు. ఈ కేసు నేటికీ పరిష్కారం కాలేదు. 1974లో కెనడాలోని అట్టావా విమానాశ్రయంలో ఒక గార్డు తుపాకీతో బెదిరించి బంగారాన్ని దొంగలించాడు.












Click it and Unblock the Notifications